బన్నీ వివాదాన్ని క్లియర్ చేసిన స్టార్ నిర్మాత?

అల్లు అర్జున్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘గీత ఆర్ట్స్’ ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈమెతో నివేదా పేతురాజ్ కూడా ఓ హీరోయిన్ గా నటిస్తుంది. సుశాంత్, నవదీప్ వంటి యంగ్ హీరోలు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. శరవేగంగా చిత్రాన్ని పూర్తి చేసి 2020 సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఇదిలా ఉండగా ఈ చిత్రం షూటింగ్ సెట్స్ లో ఊహించని సంఘటన చోటుచేసుకుందట.

allu-arjuns-attitude-trouble-on-the-sets1

వివరాల్లోకి వెళితే.. కో డైరెక్టర్ సత్యం, అల్లు అర్జున్ మధ్య వివాదం చోటుచేసుకుందట. కో డైరెక్టర్లు షాట్ రెడీ అయిన తర్వాత హీరోలకు సమాచారం ఇస్తుంటారన్న సంగతి తెలిసిందే. షాట్ రెడీ అయింది రావాలని వారు పిలుస్తుంటారు. ఇలాగే అల్లు అర్జున్ కు… సత్యం షాట్ రెడీ అయిందని మూడు సార్లు పిలిచాడట.. కానీ అల్లు అర్జున్ షాట్ లోకి రాకుండా అతని పై కోపంగా అరిచాడట. ‘మాటి మాటికీ పిలుస్తున్నాడు’ అని స్క్రిప్ట్ పేపర్లని బన్నీ.. సత్యం పై విసిరి కొట్టాడట. ఈ ప్రవర్తనతో కో డైరెక్టర్ సత్యం మనస్తాపానికి గురయ్యి … డైరెక్టర్స్ అసోసియేషన్ లో కంప్లైంట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ‘మాకు ఎలాంటి కంప్లైంట్ అందలేదని’ డైరెక్టర్స్ అసోసియేషన్ చెబుతున్నారు. ఈ గ్యాప్లో అల్లు అరవింద్ ఇన్వాల్వ్ అయ్యి మొత్తం మేటర్ క్లియర్ చేసారని. సత్యం, బన్నీలకు మధ్య రాజీ కుదిర్చారని సమాచారం. మరి ఇందులో ఎంత వరకూ నిజముందో కానీ.. ‘అల్లు అర్జున్ దురుసు ప్రవర్తన కాస్త తగ్గించుకుంటే మంచిదని’ ఫిలింనగర్లో కామెంట్లు వినిపిస్తున్నాయి.

Share.