భారతీయుడు 2 కోసం 40 కోట్ల యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేసిన శంకర్!

శంకర్ సినిమాల్లో ఇంతకుముందు మంచి కథతోపాటు భారీ కమర్షియల్ హంగులు, గ్రాఫిక్స్ ఉండేవి. ఈమధ్యకాలంలో కథ-కథనం అనేవి లేకుండా కేవలం కమర్షియల్ హడావుడి మాత్రమే కనిపిస్తోంది. అందుకు సరైన ఉదాహరణ “రోబి 2.0” చిత్రం. దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయి కలెక్షన్స్ రాబట్టలేక కుదేలైంది. అందుకే.. శంకర్-కమల్ హాసన్ ల క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న “భారతీయుడు 2” చిత్రాన్ని నిర్మించడానికి నిర్మాతలు బడ్జెట్ ఆంక్షలు పెట్టారు.

bharateeyudu-2-movie-release-date-fixed .1

అయినప్పటికీ.. శంకర్ వైఖరిలో పెద్దగా మార్పు ఏమీ రాలేదు. ఈ సినిమా కోసం 40 కోట్ల రూపాయలతో ఒక యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేశాడు. దాదాపు 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు ఇందులో పాల్గొననున్నారు. ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి తీసే ఈ యాక్షన్ సీక్వెన్స్ నిడివి కేవలం 5 నిమిషాలు కావడం గమనార్హం. దాంతో.. 5 నిమిషాల సీన్ కోసం 40 ఆఖర్చు ఎందుకు శంకర్ అని నిర్మాతలు నానా బాధలు పడుతున్నారు.

రాజుగారి గది 3 సినిమా రివ్యూ & రేటింగ్!
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.