సడన్ షాక్ ఇచ్చిన స్వీట్ గర్ల్ షాలిని పాండే

“అర్జున్ రెడ్డి” సినిమాలో లెక్కలేనన్ని ముద్దులు, శృంగార సన్నివేశాల్లో నటించినప్పటికీ అమ్మడికి ఎందుకో హాట్ ఇమేజ్ రాలేదు. ఆమె సినిమాల్లో కంటే రియల్ లైఫ్ లో వ్యవహరించే తీరు ఆమెను హాట్ హీరోయిన్ గా కాకుండా స్వీట్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. కానీ.. “అర్జున్ రెడ్డి” లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత కూడా షాలిని పాండేకి తెలుగులో ఆశించిన స్థాయి అవకాశాలు రాలేదనే చెప్పాలి. తమిళంలో ఒక మూడు సినిమాల్లో నటించినప్పటికీ ఒక్కటి కూడా విడుదలవ్వలేదు. తెలుగులో నటించిన “118” సక్సెస్ క్రెడిట్ కూడా కళ్యాణ్ రామ్, నివేదా థామస్ షేర్ చేసుకొన్నారే తప్ప షాలిని పాండేకి మాత్రం దక్కలేదు.

shalini-pandey-stunning-pose1

shalini-pandey-stunning-pose2

తెలుగులో విరివిగా సినిమాలు సైన్ చేస్తున్నప్పటికీ.. అమ్మడికి మళ్ళీ మంచి ఆఫర్ మాత్రం దొరకలేదు.
మరి ఆ కారణంగా హర్ట్ అయ్యిందో లేక నిజంగానే కొత్తగా ట్రై చేయాలి అనుకుందో తెలియదు కానీ.. ఉన్నట్లుండి బికినీ ఫోటోలు తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ లో అప్లోడ్ చేసి అందరికీ స్వీట్ షాక్ ఇచ్చింది. ఆ ఫోటోలు చూసినవాళ్ళందరూ మొదట ఆమె షాలిని పాండే అని నమ్మకపోయినప్పటికీ.. చివరికి నమ్మారు. మరి షాలినిపాండే బికినీ ఫోటోలు ఆమెకు సరికొత్త ఆఫర్లు ఏమైనా తెచ్చిపెడతాయో లేదో చూడాలి.

Share.