దిల్ రాజుకి తలనొప్పిగా మారిన విజయ్ దేవరకొండ హీరోయిన్..!

టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోయిన్లకు ఇచ్చే ప్రాధాన్యత మరే ఇండస్ట్రీలోనూ ఇవ్వరు. ఇదే మాట చాలా మంది హీరోయిన్లు చెప్పారు. ఒక్క హీరోయిన్లే కాదు సీనియర్ నటులు, నటీమణులు కూడా చెప్పారు. ఇక్క నిర్మాతలు, దర్శకులు హీరోయిన్లకు మంచి ప్రాధాన్యత ఇస్తుంటారు. వారి అడిగిన పారితోషికంతో పాటు పెద్ద సినిమాలకు కూడా రికమెండ్ చేస్తుంటారని ఎంతో మంది హీరోయిన్లు గతంలో స్టేట్మెంట్లు ఇచ్చారు. అలాంటిది కొంతమంది తెలుగు హీరోయిన్లే ఇక్కడ బడా నిర్మాతల్ని ఇబ్బంది పెడితే.. తరువాత వారికి మిగిలిన దర్శక నిర్మాతలు ఆఫర్లు ఇస్తారా? అంటే అనుమానం అనే చెప్పాలి.

dil-raju-shalini-pandey

ఇక అసలు మేటర్ ఏమిటంటే.. ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన షాలినీ పాండే.. ఆ తరువాత ‘మహానటి’ ‘118’ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. అయినప్పటికీ ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఆమె ట్యాలెంట్ ను గుర్తించిన దిల్ రాజు.. తాను నిర్మించే ‘ఇద్దరి లోకం ఒక్కటే’ అనే చిత్రంలో అవకాశం ఇప్పించాడు. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ చిత్రం త్వరలో విడుదల కాబోతుంది. అయితే ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉందట. షాలినీ పాండే పై కొన్ని కీలక సన్నివేశాలు తీయాల్సి ఉండగా.. ఆమె మాత్రం బాలీవుడ్ ఆఫర్ వచ్చిందని ఈ సినిమాని పట్టించుకోవడం మానేసిందట. దీంతో దిల్ రాజు ఓసారి ఈమెతో కూర్చొని మాట్లాడాలని డిసైడ్ అయ్యాడని తెలుస్తుంది. దిల్ రాజు లాంటి బడా నిర్మాతను ఇలా ఇబ్బంది పెడితే తరువాత ఈమెకు ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉండదని కొందరు ఫిలింనగర్ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు..!

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Share.