బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన షాలిని పాండే

టాలీవుడ్లో టాలెంట్ కంటే గ్లామర్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనే విషయం “అర్జున్ రెడ్డి” సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకొన్న షాలిని పాండే విషయంలో మరోసారి ప్రూవ్ అయ్యింది. ఆ సినిమాలో అభినయంతో విశేషంగా ఆకట్టుకొన్న షాలిని పాండేకి ఆ తర్వాత తెలుగులో ఆశించిన స్థాయి ఆఫర్ ఒక్కటీ రాలేదు. “118”లో నటించినప్పటికీ.. ఆ సినిమాతో ఆమెకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. తమిళంలో రెండు సినిమాల్లో నటించింది కానీ.. ఆ సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయి అనే విషయంలో ఇప్పటివరకూ క్లారిటీ లేదు.

shalini-pandey-to-make-her-bollywood-debut1

పాపం షాలిని పాండే కెరీర్ గురించి ఆమె తప్ప అందరూ బాధపడ్డారు. అయితే.. థియేటర్ బ్యాగ్రౌండ్ ఉన్న షాలిని మాత్రం తనకు అవకాశాలు రావడం లేదని మాత్రం ఎప్పుడూ బాధపడలేదు. ఆ సింప్లిసిటీయే ఆమెకు ఇప్పుడు ఏకంగా మూడు బాలీవుడ్ సినిమాలు సైన్ చేసేందుకు దోహదపడింది. బాలీవుడ్ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ యష్ రాజ్ తో షాలిని పాండే మూడు సినిమాల కాంట్రాక్ట్ సైన్ చేసింది. అందులో మొదటి చిత్రంతోనే రణవీర్ సింగ్ తో కలిసి నటించే అవకాశం సొంతం చేసుకొంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వనున్న ఈ చిత్రంలో షాలిని పాండే లీడ్ రోల్ ప్లే చేస్తుండడం విశేషం. మరి ఇప్పటికైనా మన టాలీవుడ్ ఫిలిమ్ మేకర్స్ షాలిని పాండే టాలెంట్ ను గుర్తిస్తారో లేదో చూడాలి.

Share.