హాట్ ఫోజులతో హీటెక్కిస్తున్న స్వీట్ హీరోయిన్

“అర్జున్ రెడ్డి” సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన షాలినిపాండే గురించి తెలియనివారుండరు. ఆ సినిమాలో అమ్మడు పెట్టిన ముద్దులకంటే.. ఆమె క్యూట్ నెస్ జనాల్ని ఎక్కువగా ఆకట్టుకొంది. కానీ.. ఎందుకో అమ్మడికి తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. తమిళంలో మాత్రం రెండు మూడు సినిమాలు చేసింది. కానీ.. అవి కూడా విడుదలవ్వలేదు. అయితే.. మొన్నామధ్య విడుదలైన “118”కి మంచి రివ్యూస్ రాకపోయినా.. సినిమా మాత్రం మంచి హిట్ కొట్టింది. దాంతో మళ్ళీ తెలుగులో కాన్సన్ ట్రేట్ చేసేందుకు సన్నద్ధమవుతోంది షాలినిపాండే. ఎలాంటి సన్నివేశాన్నైనా అద్భుతంగా పండించగల సత్తా ఉన్న షాలినిపాండే గ్లామర్ రోల్స్ ప్లే చేయగలదా అని చిన్న డౌట్ ఉండేది దర్శకులకు.

ఆ డౌట్ ను ఇండైరెక్ట్ గా క్లియర్ చేస్తోంది షాలినిపాండే. ఇవాళ జరిగిన “118” సక్సెస్ మీట్ కి మోడ్రన్ డ్రెస్ తో హాజరైన షాలినిపాండేను చూసినవాళ్ళందరూ నోరెళ్ళబెట్టారు. మరో హీరోయిన్ అయిన నివేదా థామస్ ను గట్టిగానే డామినేట్ చేసింది షాలినిపాండే. ఈ మోడ్రన్ అవతార్ దర్శకులకు తాను మోడ్రన్ గానూ కనిపించగలను, ఆకట్టుకోగలను అని ప్రూవ్ చేయడానికే అని తెలుస్తోంది. మరి అమ్మడి గ్లామర్ సైడ్ ను గుర్తించిన దర్శకనిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇస్తారేమో చూడాలి.

CLICK HERE FOR IMAGES 

Share.