బన్నీతోపాటు మహేష్ బాబుకి కూడా కెరీర్ బెస్ట్ సాంగ్స్ ఇచ్చిన శేఖర్ మాస్టర్

“బ్లాక్ బస్టర్ గా బాప్” అని మహేష్ బాబు.. “సంక్రాంతి విన్నర్” అని అల్లు అర్జున్.. తమ తమ సినిమాలను హిట్ అని ప్రూవ్ చేసుకోవడం కోసం రకరకాల పోస్టర్లు విడుదల చేస్తున్నారు. ఇద్దరి సినిమాలకు మంచి టాక్ తోపాటు కలెక్షన్స్ వస్తున్నాయి. ఒకరిది మాస్ సినిమా, మరొకరిది క్లాస్ సినిమా. ఈ పండక్కి ఇద్దరి సినిమాలు 100 కోట్ల షేర్ వసూలు చేయడం చాలా ఈజీ. అయితే.. ఈ ఇద్దరు హీరోలు హిట్ కొట్టడం కంటే.. వీళ్ళిద్దరి సినిమాల్లో పాటలు సూపర్ హిట్ అవ్వడం.. ఆడియోలుగా కంటే విజువల్ గా ఆ పాటలకు విపరీతమైన రెస్పాన్స్ రావడం అనేది ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన విషయం.

Mahesh Babu Allu Arjun

“మైండ్ బ్లాక్” సాంగ్ లో బాబు స్టెప్పులు చూశాక మహేష్ బాబులో ఇంత మంచి డ్యాన్సర్ ఉన్నాడా అని యాంటీ ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. ఇక బన్నీ డ్యాన్స్ ల గురించి చెప్పాల్సిన అవసరం లేనప్పటికీ.. అతడి డ్యాన్స్ లో గ్రేస్ కనిపించి చాలా ఏళ్లయ్యింది. ఆ గ్రేస్ మళ్ళీ “బుట్ట బొమ్మ” సాంగ్ లో కనిపించింది. ఈ రెంటికీ ముఖ్య మరియు మూల కారకుడు శేఖర్ మాస్టర్. మహేష్ లోని డ్యాన్సర్ ను ప్రేక్షకులకు పరిచయం చేసి.. బన్నీ డ్యాన్సుల్లో మిస్ అయిన గ్రేస్ ను మళ్ళీ వెనక్కి తీసుకొచ్చిన ఘనత శేఖర్ మాస్టర్ ది. మహేష్ & బన్నీ ఫ్యాన్స్ శేఖర్ మాస్టర్ కి సపరేట్ ఫ్యాన్స్ బేస్ స్టార్ట్ చేసినా తప్పులేదు. ఆస్థాయిలో ఇద్దరి హీరోల అభిమానులను రంజింపజేశాడు శేఖర్ మాస్టర్. సో, ఈ సంక్రాంతి రియల్ విన్నర్ మాత్రం శేఖర్ మాస్టరే.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Share.