షారుక్ రాబోయే సినిమా తెలుగులో కూడా..

అప్పట్లో బాలీవుడ్ స్టార్ హీరోలు చాలా వరకు సౌత్ ఇండస్ట్రీ మార్కెట్ ని పెద్దగా లెక్క చేసేవారు కాదు. కానీ ఎప్పుడైతే ఇక్కడ సినిమాలు బాలీవుడ్ సినిమాలతో సమానంగా ఈజీగా 100కోట్ల బిజినెస్ ను అందుకోవడం స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి వారి ఆలోచనలు మారాయి. ఒక్కసారిగా తమిళ్ తెలుగు సినిమాలపై కూడా పాజిటివ్ గా కామెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక బాహుబలి అనంతరం సౌత్ సినిమాల్లో కూడా నటించడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.

మన హీరోలు పాన్ ఇండియా అంటూ ఇప్పటికే హిందీ మార్కెట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. కానీ అక్కడి హీరోలు మాత్రం తెలుగులో పెద్దగా సక్సెస్ అవ్వలేకపోతున్నారు. సల్మాన్ ఖాన్ దబాంగ్ 3తో అప్పట్లో హడావుడి చేశాడు గాని వర్కౌట్ కాలేదు. ఇక అమీర్ ఖాన్ కూడా థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్ సినిమాతో హిట్ కొట్టాలని తెలుగులో భారిగానే రిలీజ్ చేశారు కానీ కుదరలేదు. ఇక ఇప్పుడు షారుక్ ఖాన్ అట్లీ దర్శకత్వంలో చేయబోయే సంఖి సినిమాని మాత్రం సౌత్ లో అన్ని భాషల్లో విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

గత ఏడాది నుంచి ఈ సినిమాపై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. కానీ ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ఇక సంఖి సినిమాతో తమిళ్ తెలుగులో కూడా సక్సెస్ కొట్టాలని షారుక్ భారీగా ప్లాన్ వేసినట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు వాస్తవమే తెలియాలి అంటే కాలమే సమాధానం ఇవ్వాలి.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.