విశాల్ ను ఎలా అభినందించాలో తెలియట్లేదు..!

కోలీవుడ్ హీరో విశాల్ ప్రస్తుతం ‘టెంపర్’ రీమేక్ అయిన ‘అయోగ్య’ లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. దీంతో పాటూ సుందర్.సి డైరెక్షన్లో కూడా ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ సమయంలో గాయపడ్డాడు విశాల్. దీంతో షూటింగ్ ఆగిపోతుందని అందరూ అనుకున్నారు. అయితే ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా వెంటనే షూటింగ్ లో జాయిన్ అయ్యాడంట విశాల్. ఈ విషయం పై దర్శకుడు సుందర్.సి భార్య అయిన ఖుష్బూ స్పందించింది.

తాజాగా విశాల్ పై ఖుష్బూ ప్రశంసల వర్షం కురిపించడం విశేషం. ఖుష్బూ మాట్లాడుతూ… “షూటింగ్ లో గాయపడినప్పటికీ, నిర్మాత నష్టపోకూడదనే ఉద్దేశ్యంతో, విశాల్ తన బాధను తట్టుకుని మరీ షూటింగ్ లో పాల్గొన్నాడు. అతన్ని ఎలా అభినందించాలో అర్థం కావడం లేదు” అంటూ తెలిపింది ఖుష్బూ. ఈ చిత్రానికి ఖుష్బూ కూడా ఓ నిర్మాత కావడంతో ఖుష్బూ ఇలా స్పందించినట్టు స్పష్టమవుతుంది.

Share.