త్రివిక్రమ్ బన్నీ కాంబో మూవీలో ఇద్దరూ హాట్ బ్యూటీలే

త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ ల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం మొదటి షెడ్యూల్ ముగించుకొని త్వరలోనే సెకండ్ షెడ్యూల్ కోసం సన్నద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా.. ఇప్పుడు సెకండ్ హీరోయిన్ గా మరో హాట్ హీరోయిన్ ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ అంటే ఏదో నిత్యామీనన్ లాంటి పద్ధతైన హీరోయిన్ ను తీసుకొన్నారనుకొంటే పొరబడ్డట్లే.

allu-arjun-to-romance-with-two-hot-heroines2

allu-arjun-to-romance-with-two-hot-heroines1

త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబో మూవీ కోసం ఫైనల్ చేసింది త్వరలోనే పూరీ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న కెటికా శర్మా అనే బాలీవుడ్ భామను. పూరీ హీరోయిన్ అంటే మామూలుగా ఉంటుందా చెప్పండి.. కెటికా శర్మ ఎలా ఉంటుంది అనేది ఆమెను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. మరి ఆ క్రేజీ బ్యూటీని మన త్రివిక్రమ్ ఇంకెంత క్రేజీగా చూపిస్తాడో చూడాలి. ఇకపోతే ఈ సినిమాను ఈ ఏడాది చివరిలోనే విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి.

Share.