సహజమైన కథ-కథనాలతో ఎంటర్ టైనింగ్ గా సవారీ!

మంచి నటుడు అనిపించుకున్నప్పటికీ.. సరైన కమర్షియల్ సక్సెస్ దొరక్క నిలదొక్కుకోలేకపోయిన కథానాయకుడు నందు. కాస్త విరామం అనంతరం నందు హీరోగా మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్ధమవుతున్నాడు. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో చిత్రం “సవారీ”. షార్ట్ ఫిలిమ్స్ తో ఇంటర్నెట్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్న సాహిత్ డెబ్యు సినిమా ఇది. ప్రియాంక శర్మా కథానాయికగా నటిస్తోంది. తెలంగాణ నేపధ్యంలో సగటు మనిషి జీవితంలో జరిగే సంఘటనల సమాహారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ నిన్న విడుదలైంది.

పెళ్లి బారాత్ లలో పెళ్ళికొడుకు ఎక్కే గుర్రంతో జీవనం సాగించే ఓ కుర్రాడి జీవితంలోకి ఒక అమ్మాయి ఎంటర్ అవుతుంది. ఆ అమ్మాయి కారణంగా ఆ కుర్రాడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? అసలు ఆ అమ్మాయి హీరో లైఫ్ లోకి ఎందుకు ఎలా ఎంట్రీ ఇచ్చింది? ఈ సినిమాలో గుర్రం బాద్ షాకి కూడా చిన్న కథ ఉందండోయ్.. ఈ అంశాలన్నిట్నీ చాలా సింపుల్ గా అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ట్రైలర్ తో పరిచయం చేశాడు దర్శకుడు. కామెడీ, సెంటిమెంట్, ఎమోషన్స్ వంటి అన్నీ సమపాళ్లలో ఉన్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదలవుతోంది. నందు ఈ సినిమాతో కథానాయకుడిగా మంచి హిట్ అందుకోవాలని కోరుకొందాం.


సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Share.