రజనీ, కమల్ పై ఫైరయిన సత్యరాజ్..!

తమిళ నాడు లో సినిమా వాళ్ళు కూడా రాజకీయాల్లో రాణించిన వారిని ఎంతోమందిని చూసాం. కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజాలు సినీ రంగం నుండి వచ్చినవాళ్ళే కావడం విశేషం. ఇప్పుడు వారి దారిలోనే కమల్ హాసన్, రజనీకాంత్ వంటి స్టార్ హీరోలు కూడా రాజకీయాల్లో రాణించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే యూనివెర్సల్ హీరో కమల్ హాసన్ ‘మక్కల్ నీది మయ్యం’ అనే పార్టీని స్థాపించి ఎన్నికల్లో కూడా పాల్గొన్నారు. ఇక త్వరలో రజనీ సైతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమవుతున్నారు.

అయితే వీరి పొలిటికల్ ఎంట్రీల పై తాజాగా స్పందించిన నటుడు సత్యరాజ్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశాడు. అయన మాట్లాడుతూ.. “తమిళ రాజకీయాల్లో శూన్యత ఏర్పండింది. రాజకీయాల్లోకి వచ్చిన కమల్, రజనీకాంత్ వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం లేదు. డీఎంకే లాంటి వేళ్ళూనుకుపోయిన పార్టీని పెకలించాలని అనుకోవడం మూర్ఖత్వం. రాజకీయాలు చేయడానికి చాలామంది ఉన్నారు. ఎవరి పని వారు చూసుకుంటే చాలా మంచిది” అంటూ కామెంట్ చేసాడు. సత్యరాజ్ ఇంత ఘాటుగా స్పందించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ టాపిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. కొందరు నెటిజన్లు సత్యరాజ్ పై ‘కట్టప్పా.. మనకెందుకప్పా..” అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Share.