ఇప్పుడు బాల్.. మహేష్ కోట్లో ఉందట..!

వీసాల సమస్య కారణంగా అమెరికాలో ప్రారంభంకావల్సిన మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రం షూటింగ్ క్యాన్సిల్ అయ్యిందని వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో జ‌న‌వ‌రి వరకూ ఈ చిత్రం షూటింగ్ మొదలుకాదని, అందుకే మ‌హేష్ బాబు.. మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ డైరెక్షన్లో సినిమా మొదలుపెట్టాలని ఆశపడుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.అయితే త్రివిక్రమ్ దగ్గర ప్రస్తుతం బౌండ్ స్క్రిప్ట్ అయితే రెడీగా లేదు. ఒకవేళ ఈ రెండు నెలల్లో కనుక రెడీ చేసి మహేష్ ను మెప్పిస్తే..

డౌట్ లేకుండా త్రివిక్రమ్ సినిమానే మొదట సెట్స్ పైకి వెళుతుంది. అప్పుడు దర్శకుడు పరశురామ్ కు కూడా పెద్ద ఇబ్బందనే చెప్పాలి. పాపం అతను రెండేళ్ల పైనే సినిమా లేకుండా ఖాళీగా ఉన్నాడు.. సరిగ్గా నాగ చైతన్యతో సినిమా మొదలుపెట్టే టైంకి మహేష్ లాక్కొచ్చేసాడు. ఇదిలా ఉండగా… మ‌హేష్‌తో సినిమా చేసే అవకాశం మిస్ చేసుకోకూడదని దర్శకుడు పరశురామ్ తో పాటు నిర్మాత‌లు కూడా భావిస్తున్నారట. ఈ క్రమంలో అమెరికా షెడ్యూల్ ను పక్కన పెట్టి..

ఇండియాలోనే షూటింగ్ మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారట.అవసరమైతే మహేష్ కు మరో రెండు నెలలు బ్రేక్ ఇచ్చి.. అతని లేని సన్నివేశాలతో షూటింగ్ మొదలుపెట్టెయ్యాలని వారు భావిస్తున్నారట‌. అయితే దీనికి మ‌హేష్ పర్మిషన్ కూడా కావాలి. అతను ఓకే అంటే ఇబ్బంది లేదు. అందరూ హ్యాపీనే..!కానీ నో చెబితే మాత్రం దర్శకనిర్మాతలకు షాక్ తగిలినట్టే..! చూడాలి మహేష్ ఏమంటాడో..!

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Share.