కామెడీ, ఎమోషన్స్, ఎలివేషన్స్, సెంటిమెంట్స్ కలగలుపుగా సరిలేరు నీకెవ్వరు ట్రైలర్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన పంధా మార్చుకొని తొలిసారి ఆర్మీ మేజర్ గా నటించిన చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. మహేష్ బాబు సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంతో నిన్నటితరం కథానాయకి విజయశాంతి రీఎంట్రీ ఇస్తుండగా.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎకె ఎంటర్ టైన్మెంట్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్, ఎస్.వి.సి.సి.పిక్చర్స్ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఇవాళ ఎల్.బి.స్టేడియంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా భారీ అభిమాన సందోహం నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్రైలర్ ను విడుదల చేశారు.

Sarileru Neekevvaru Movie Trailer Review1

సూపర్ స్టార్ మహేష్ బాబు “నెవర్ బిఫోర్.. నెవర్ ఆఫ్టర్” అన్నట్లుగా కామెడీ టైమింగ్, యాక్షన్ & పంచ్ డైలాగులతో ఇరగొట్టేసాడు. అనిల్ రావిపూడి-మహేష్ బాబు కాంబినేషన్ అంటే ఏం ఎక్స్ పెక్ట్ చేయాలో అన్నీ ఈ ట్రైలర్లో ఉన్నాయి. రష్మిక, సంగీత, బండ్ల గణేష్, రాజేంద్రప్రసాద్ ల కాంబినేషన్ లో ట్రైన్ ఎపిసోడ్ అదిరిపోయింది. ఇక విజయశాంతి-మహేష్ బాబు కాంబినేషన్ సీన్స్ పవర్ ఫుల్ & ఎమోషనల్ గా.. మహేష్ బాబు-ప్రకాష్ రాజ్ కాంబినేషన్ సీన్స్ థ్రిల్లింగ్ గా ఉన్నాయి. సో, ఈ సంక్రాంతికి సూపర్ స్టార్ హిట్ కొట్టడం ఖాయం అన్నమాట. డియర్ సూపర్ స్టార్ ఫ్యాన్స్.. గెట్ రెడీ టు ఎంజాయ్ సూపర్ స్టార్ మ్యానియా.

Share.