మహేష్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ గ్యారంటీ..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అపజయమెరుగని దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న మాస్ అండ్ ఎంటర్టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. చాలా ఏళ్ళ తరువాత మహేష్ నుండీ వస్తున్న ఫుల్ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ కాబట్టి ఈ చిత్రం భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ 6 ఏళ్ళ తరువాత సంక్రాంతి బరిలోకి వస్తున్నాడు మహేష్. ఈకారణంగా కూడా ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయశాంతి, బండ్ల గణేష్ వంటి వాళ్ళు ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వడం అలాగే గోల్డెన్ లెగ్ గా పాపులర్ అయిన రష్మిక మందన కూడా హీరోయిన్ కావడంతో ఈ చిత్రానికి మరింత క్రేజ్ పెరిగింది. జనవరి 11న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు టీజర్ ను కూడా విడుదల చేశారు. ఈ టీజర్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి.

Mahesh

‘మీరెవరో మాకు తెలీదు.. మీకు మాకు ఎలాంటి రక్త సంబంధం లేదు.. కానీ మీకోసం మీ పిల్లలకోసం పగలు,రాత్రి,ఎండ, వాన అని లేకుండా పోరాడుతూనే ఉంటాం.. ఎందుకంటే మీరు మా బాధ్యత’ అంటూ మహేష్ చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలైంది.

1-Mahesh

‘మీరంతా నేను కాపాడుకునే ప్రాణాలు రా.. మిమ్మల్నెలా చంపుకుంటాను రా.. మీకోసం ప్రణాలిస్తున్నాం రా అక్కడ.. మీరేమో కత్తులు, గొడ్డళ్లు ఏసుకుని ఆడాళ్ళ మీద.. బాధ్యత ఉండనక్కర్లా..? అంటూ అజయ్ కు మహేష్ క్లాస్ పీకుతూ చెప్పే డైలాగ్ పీక్స్ లో ఉంది.

2-Mahesh

‘భయపడేవాడే భేరానికొస్తాడు.. మన దగ్గర భేదాలు లేవమ్మా’ అంటూ కొండారెడ్డి బురుజు వద్ద మహేష్ చెప్పే డైలాగ్ మాస్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదు.

3-Mahesh

‘గాయం విలువ తెలిసిన వాడే.. సాయం చేస్తాడు బాబాయ్’ అంటూ విజయశాంతి చెప్పిన డైలాగ్ మాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునే విధంగా ఉంది.

4-Mahesh

‘ప్రతీ సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు.. ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు’ అంటూ టీజర్ చివర్లో ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగ్ ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించేలా ఉంది.

5-Mahesh

మొత్తానికి ఇప్పటి వరకూ ప్రమోషన్ల విషయంలో వెనుకబడ్డారు అనుకున్న ‘సరిలేరు నీకెవ్వరు’ టీం.. ఈ టీజర్ తో ఒక్కసారిగా ఆ లోటు మొత్తాన్ని తీర్చేసారనే చెప్పాలి. చాలా రోజుల తరువాత మహేష్ ను ఫుల్ మాస్ రోల్ లో చూపించాడు అనిల్ రావిపూడి. దేవి శ్రీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రొటీన్ గా ఉన్నప్పటికీ కరెక్ట్ గా సెట్ అయ్యిందనే చెప్పాలి. ఇదే ఫార్మట్ లో ట్రైలర్, సినిమా కూడా ఉంటే సంక్రాంతిని బాగా క్యాష్ చేసుకునే అవకాశం ఉంటుంది అనడంలో సందేహం లేదు.


“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.