మహేష్ vs పవన్: ఆ డేట్‌కు వచ్చినోళ్లకే జాక్ పాట్!

ఒక సినిమా హిట్ కావాలి అంటే కాంటెంట్ తో పాటు రిలీజ్ డేట్ కూడా చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు కలెక్షన్స్ ఎక్కువ రావడానికి అదే మెయిన్ రీజన్. ఇక 2022 సంక్రాంతి బాక్సాఫీస్ ఫైట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మహేష్ బాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఒకేసారి పోటీకి సిద్దామవ్వడం ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది.

మహేష్ సర్కారు వారి పాటతో ముందే సంక్రాంతిని టార్గెట్ చేసినట్లు క్లారిటీ ఇచ్చాడు. ఇక ఆ ఆదివారం పవన్ కళ్యాణ్ 27వ సినిమా కూడా సంక్రాంతికి సిద్ధమవుతున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేసింది. అయితే ఇద్దరిలో ఎవరు ముందు వస్తారు అనేది మరింత ఆసక్తిని కలిగిస్తోంది. ఎందుకంటే 2022 జనవరి 12 (బుధవారం) చాలా ముఖ్యమైన తేదీ.

జనవరి 12 బుధవారం ఏదైనా సినిమా రిలీజ్ అయితే మంగళవారం రోజు యూఎస్ ప్రీమియర్స్ బోనస్ అని చెప్పవచ్చు. ఇక గురువారం భోగి, శుక్రవారం సంక్రాంతి సెలవులు కాబట్టి పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలను అడ్డుకోవడం బిగ్గెస్ట్ చాలెంజ్. వీకెండ్స్ మరో బిగ్గెస్ట్ బోనస్ కాబట్టి 100కోట్ల బిజినెస్ చాలా తొందరగానే ఫినిష్ అవుతుంది. అయితే రూల్ ప్రకారం బిగ్ స్టార్స్ సినిమాలకు ఒక రోజు గ్యాప్ ఉండాల్సిందే. మరి పవన్, మహేష్ ఇద్దరిలో ఎవరు ముందు వస్తారో చూడాలి.

Most Recommended Video

ఇప్పటవరకూ ఎవరు చూడని ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి రేర్ ఫోటో గ్యాలరీ!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.