బోల్డ్ డైరెక్టర్ కి ప్రభాస్ ఓకే చెప్తాడా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాలు అంగీకరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘రాధేశ్యామ్’ సినిమాలో నటిస్తోన్న ఈ హీరో.. ‘సలార్’, ‘ఆదిపురుష్’ సినిమాలతో పాటు నాగ్ అశ్విన్ సినిమాను కూడా పూర్తి చేయాల్సివుంది. ఈ సినిమాలు కాకుండా మరో సినిమా అనౌన్స్ చేయాల్సివుంది. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ ప్రభాస్ తో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తుంది. ప్రభాస్ కూడా మంచి కథ దొరికితే సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు.

దీంతో ఈ సినిమా కోసం మైత్రి సంస్థ బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ని రంగంలోకి దింపుతుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మరో డైరెక్టర్ పేరు వెలుగులోకి వచ్చింది. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేయాలని మైత్రి ప్లాన్ చేస్తుందట. నిజానికి ‘అర్జున్ రెడ్డి’ తరువాత సందీప్.. మహేష్ బాబుతో సినిమా చేయాలనుకున్నాడు. కానీ కుదరలేదు.

బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో ముంబైకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం రణబీర్ కపూర్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తరువాతి ప్రాజెక్ట్ ప్రభాస్ తో చేయలని అనుకుంటున్నాడు సందీప్ రెడ్డి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఇంకా డిస్కషన్ స్టేజ్ లోనే ఉంది. మొదట సందీప్.. ప్రభాస్ కి సరిపడే లైన్ ను తయారుచేయాలి. దానికి ప్రభాస్ ఒప్పుకోవాలి. ఆ తరువాత కానీ ఈ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అవ్వదు. ఇదంతా జరగడానికి కాస్త సమయం పట్టేలా ఉంది.

Most Recommended Video

చెక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అక్షర సినిమా రివ్యూ & రేటింగ్!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Share.