సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ సినిమా ఆ బాలీవుడ్ స్టార్ హీరోతోనే

“కబీర్ సింగ్” బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం తన బేస్ ను పూర్తిగా బాలీవుడ్ కి మార్చేసిన సందీప్ రెడ్డి.. తన అసిస్టెంట్స్ ను దర్శకులుగా పరిచయం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటూనే.. తన మూడో సినిమాకి సన్నాహాలు చేసుకొంటున్నాడు. సల్మాన్ ఖాన్ తో సినిమా చేసే ఛాన్స్ వచ్చినప్పటికీ.. ఆయనకు సూట్ అయ్యే కథ సందీప్ దగ్గర లేకపోవడంతో.. ఆయన బదులు రణబీర్ కపూర్ ను ఎంచుకొన్నాడు సందీప్. ఆల్రెడీ రణబీర్ కు కథ కూడా చెప్పాడట. అయితే.. రణబీర్ ఆల్రెడీ మూడు భారీ సినిమాలకి డేట్స్ ఇచ్చేసి ఉండడంతో.. ఒక ఏడాదిపాటు ఆగమన్నాడట. సందీప్ కి కూడా అర్జెంట్ గా సినిమా తీయాలన్న కంగారు లేదు కాబట్టి సరేనన్నాడట. ఈ ప్రొజెక్ట్ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలోనే ఉండవచ్చు.

sandeep-reddy-vanga-next-with-ranbir-kapoor1

ఇకపోతే.. సందీప్ రెడ్డిని బాలీవుడ్ మీడియాలో కొందరు మాత్రం కాస్త గట్టిగా నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ.. సందీప్ రెడ్డి వాళ్ళను ఏమాత్రం పట్టించుకోకుండా ఎదుగుతున్నాడు. మరి ఈ గొడవల ఇలాగే కొనసాగుతుందా లేక ఏదైనా మార్పు ఉంటుందా అనేది తెలియాలి.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Share.