ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్ తో రచ్చ చేస్తున్న కొబ్బరిమట్ట

ఒక సినిమా తీసి హిట్ కొట్టడం కంటే ఆ సినిమాను థియేటర్లలో కంటే జనాల నోళ్ళల్లో ఎక్కువగా ఆడించడం అనేది పెద్ద సమస్య. ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారం కనుగొన్నాడు దర్శకనిర్మాత స్టీవెన్ శంకర్ అలియాస్ సాయిరాజేష్. ఒకపక్క సక్సెస్ టూర్లు చేస్తూ సినిమాని జనాలకు మరింత చేరువ చేస్తూనే.. మరోపక్క తనదైన శైలి వ్యంగ్యంతో “కొబ్బరిమట్ట” గురించి ఆన్ లైన్ లో జనాలు ఎప్పుడు చర్చించుకొనేలా చేస్తున్నాడు.

sampoornesh-babu-creating-sensation-with-kobbari-matta-fake-collections1

నిన్న సాయిరాజేష్ “కొబ్బరిమట్ట” కొత్త పోస్టర్ మీద 3 రోజుల్లో 12 కోట్ల కలెక్షన్ అని వేయించి.. క్రింద “ఫాన్స్ కోసం 9 కోట్ల ఫేక్ కలెక్షన్ ను యాడ్ చేయడం జరిగింది” అని మెన్షన్ చేయడం వలన.. ఇతర హీరోలు అలా ఫాన్స్ కోసం ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారా? అని ప్రశ్న మొదలయింది. ఈ ప్రశ్నకు సమాధానం అందరికీ తెలిసిందే అయినప్పటికీ.. కొందరు స్టార్ హీరోల అభిమానులు ఈ విషయమై కొబ్బరిమట్ట పోస్టర్లను తిడుతున్నారు. తిట్టినా, పొగిడినా తనకు కావాల్సిన పబ్లిసిటీ మాత్రం జరుగుతుండడంతో.. సంతోషంతో సైలెంట్ గా ఉన్నాడు సాయిరాజేష్.

Share.