రివ్యూలపై ఫైర్ అయిన మరో డైరెక్టర్

“మా సినిమా కలెక్షన్లకి నెగిటివ్ రివ్యూలు దిష్టి లాంటివి” అంటూ డీజే సినిమా యూఎస్ ప్రమోషన్స్ టైమ్ లో రివ్యూ రైటర్లపై నిప్పులు చెరిగాడు హరీష్ శంకర్, అతడి వాదనను హీరో అల్లు అర్జున్, నిర్మాత దిల్ రాజులు కూడా సమర్ధించారు. అయితే.. సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఎవరు కరెక్టో ప్రూవ్ చేశాయనుకోండి. ఇప్పుడు ఈ జాబితాలో చేరాడు సంపత్ నంది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన “గౌతమ్ నంద” గత శుక్రవారం విడుదలై ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకోగా.. రివ్యూలు మాత్రం బిలో యావరేజ్ గా డిసైడ్ చేసేశాయి. దాంతో శుక్రవారం, శనివారం మినిమం కలెక్షన్లతో సరిపోట్టుకొన్న “గౌతమ్ నంద” సోమవారం నుంచి మొత్తానికి డౌన్ అయిపోయాయి.

దాంతో ప్రమోషన్స్ మొదలుపెట్టి.. ఇవాళ హైద్రాబాద్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించిన సంపత్ నంది.. “మా సినిమాకి నెగిటివ్ రివ్యూలు వచ్చినా.. పబ్లిక్ పాజిటివ్ మౌత్ టాక్ తో బానే ఆడుతుంది” అంటూ రివ్యూలపై తన కోపాన్ని కొద్దిగా వెళ్లగక్కాడు. ఏమైనా అంటే అన్నామంటారు కానీ.. పాజిటివ్ రివ్యూలు వచ్చినప్పుడు మిన్నకుండిపోయి సక్సెస్ ను ఎంజాయ్ చేసే దర్శకులందరూ.. నెగిటివ్ రివ్యూలు వచ్చినప్పుడు మాత్రం రివ్యూలపై రివ్యూ రైటర్లపై నిప్పులు చెరగడం ఎంతవరకూ సబబు అనే విషయం వారి విజ్ణతకే వదిలేయాలి!


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.