‘ఎఫ్.సి.యూ.కె’ ‘కపటధారి’ రెండు సినిమాల నిర్మాతలకి సేమ్ సిట్యుయేషన్..!

కరోనా భయం పోయి జనాలు థియేటర్లకు రావడం మొదలుపెట్టిన సంగతి వాస్తవమే. అలాంటి టైములో ‘సోలో బ్రతుకే సో బెటర్’ ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే నాసిరకపు సినిమాలను కూడా జనాలు తెగ చూసారు. దాంతో అవి కమర్షియల్ గా హిట్ అనిపించుకున్నాయి. అలా అని ప్రతీ సినిమాని జనాలు యాక్సెప్ట్ చేసేస్తారు అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటనే చెప్పాలి. ఒక్కోసారి రిజల్ట్ చాలా తేడా కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మనం ‘ఎఫ్.సి.యు.కె’ ‘కపటధారి’ సినిమాలను చెప్పుకోవచ్చు. ఈ రెండు సినిమాల ప్రమోషన్లకు దర్శకనిర్మాతలు చాలా ఖర్చు చేసి ప్రమోట్ చేశారు.

కచ్చితంగా ఇవి కొట్టేస్తాయి అనే నమ్మకం ప్రేక్షకులకు కల్పించారు. కానీ కట్ చేస్తే సినిమాలు ఘోరమైన డిజాస్టర్లుగా మిగిలాయి.కనీసం కోటి రూపాయల షేర్ ను కూడా ఈ చిత్రాలు రాబట్టలేదు అంటే పరిస్థితి ఎంత ఘోరమో అర్ధం చేసుకోవచ్చు. టాలీవుడ్ ఎపిక్ డిజాస్టర్స్ లో ఈ రెండు సినిమాలు కూడా స్థానం సంపాదించుకున్నాయి. అయితే ఇక్కడ మరో కామన్ పాయింట్ కూడా ఉంది. ‘కపటధారి’ ‘ఎఫ్.సి.యు.కె’ చిత్రాలకు ఓటిటి నుండీ మంచి ఆఫర్లే వచ్చాయట.

అయినప్పటికీ అవి కాదని థియేటర్లలోనే విడుదల చేసి చేతులు కాల్చుకున్నారు. జగపతి బాబు నటించిన ‘ఎఫ్.సి.యు.కె’ చిత్రానికి మొదటి నుండీ డిజాస్టర్ అనే టాక్ వచ్చింది కాబట్టి.. దానిని పట్టించుకోలేదు ప్రేక్షకులు. కానీ సుమంత్ ‘కపటధారి’ కి మంచి టాక్ వచ్చినా కలెక్షన్లు రాలేదు. ఫిబ్రవరిలోనే ఈ రెండు చిత్రాలు విడుదలయ్యాయి.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.