మళ్ళీ అయోమయంలో పడ్డ ప్రభాస్ అండ్ టీం..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గత ఏడాది ‘సాహో’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించాడు. సుజీత్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోకపోయినప్పటికీ ఎదో ఒకరకంగా సేఫ్ అయిపోయింది. కానీ అభిమానులు ప్రభాస్ ను ఎలా చూడాలనుకున్నారో ఆ లోటుని మాత్రం తీర్చలేదు. దీంతో రాధా కృష్ణకుమార్ డైరెక్షన్లో తెరకక్కబోతున్న ప్రభాస్ 20 పైనే అసలు పెట్టుకున్నారు.

Prabhas in Jaan Movie

ఈ చిత్రానికి మొదట ‘జాన్’ అనే టైటిల్ అనుకున్నారు. కానీ ఇటీవల నిర్మాత దిల్ రాజు ’96’ తెలుగు రీమేక్ కు కూడా ‘జాను’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ టీజర్ ను కూడా విడుదల చేసాడు. శర్వానంద్, సమంత వంటి క్రేజీ తారలు ఉండడంతో ఈ ప్రాజెక్ట్ పై క్రేజ్ పెరిగింది. దీంతో ప్రభాస్ అండ్ టీం మళ్ళీ టైటిల్ మార్చాలా వద్దా అనే కన్ఫ్యూజన్ లో పడ్డారట. ఇక ఈ చిత్రానికి 150 కోట్ల వరకూ బడ్జెట్ అనుకుంటున్నారని తెలుస్తుంది.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Share.