సుధీర్ బాబు సినిమాపై సామ్ పెట్టుబడి!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత.. పెళ్లైన తరువాత కూడా నటిగా అవకాశాలు దక్కించుకుంటూనే ఉంది. సినిమాలు, యాడ్స్, టీవీ షోలు, సొంతంగా వ్యాపారాలు ఇలా ఒకటా రెండా చాలానే మ్యానేజ్ చేస్తోంది. ఇప్పుడు నిర్మాతగా కూడా మారినట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. హీరో సుధీర్ బాబు నటిస్తోన్న సినిమాపై సమంత రూ.5 కోట్ల పెట్టుబడి పెట్టిందని సమాచారం. గతంలో ‘సమ్మోహనం’, ‘వి’ సినిమాలకు కలిసి పని చేసిన సుధీర్ బాబు,

ఇంద్రగంటి మోహన్ కృష్ణ కాంబినేషన్ లో ఇప్పుడు మరో సినిమా తయారవుతోంది. కృతిశెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాను సమంత సెలబ్రిటీ మేనేజర్ మహేంద్ర నిర్మించబోతున్నారు. అయితే సమంత మాత్రం స్లీపింగ్ పార్ట్నర్ గా వ్యవహరించనుంది. పెట్టుబడి పెట్టినప్పటికీ ఆ విషయాన్ని బయటకి చెప్పకుండా తన మేనేజర్ సహాయంతో మైంటైన్ చేస్తోందట. మార్చి నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇంద్రగంటి రాసుకున్న కథ సమంతకి నచ్చడంతో ఈ సినిమాపై ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకుందట.

మొత్తానికి ఇప్పుడు నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం సమంత నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ వెబ్ సిరీస్ ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సిరీస్ టీజర్ ని రిలీజ్ చేశారు.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Share.