‘శాకుంతలం’ తరువాత సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్న సమంత?

స‌మంత‌…సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతుందా? అంటే అవుననే టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. ఇది ఆమె అభిమానులను ఒకింత నిరాశకు గురి చేసే వార్తే.. అయినప్పటికీ బ్యాడ్ న్యూస్ అయితే కాదు.ఎందుకంటే..సమంత సినిమాలకు గుడ్ బై చెప్పడంలో లేదు.. బ్రేక్ ఇవ్వబోతుంది అంతే..! అది కూడా ఆమె గుణశేఖర్ డైరెక్షన్లో చెయ్యబోతున్న ‘శాకుంత‌ల‌మ్‌’ పూర్తయిన తరువాతే.! అయితే ఈ ప్రాజెక్టుకి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఈమెకు మరిన్ని ఆఫర్లు వస్తే.. వాటిని రిజెక్ట్ చేసిందట.

అంతేకాదు ఇప్పట్లో కొత్త క‌థ‌లేవీ ఒప్పుకోను అని తేల్చి చెప్పేసిందట.కోట్లకు కోట్లు పారితోషికాలు ఇస్తామని దర్శకనిర్మాతలు ఈమెను ఒప్పించే ప్రయత్నాలు చేసినా ఈమె ఒప్పుకోలేదట. అందరికీ ఇదే మాట చెబుతుండడంతో.. ఇంత సడెన్ గా ఈమె ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నట్టు అనే డిస్కషన్లు మొదలయ్యాయి. స‌మంత కొన్నాళ్లు బ్రేక్ తీసుకోవాలని భావిస్తున్నట్టే అందరితోనూ చెబుతుందట‌. ఈ విషయం పై ఆమె సన్నిహితులను ఆరా తియ్యగా… స‌మంత మ‌న‌సు ఇప్పుడు మాతృత్వం వైపు మ‌ళ్లినట్టు తెలిపిందని వారు చెప్పుకొచ్చారు.

అందుకే… సినిమాల‌కు కొంత‌కాలం గ్యాప్ ఇవ్వాల‌నుకుంటోంద‌ని వాళ్ళు చెప్పుకొచ్చారు. ఈ మధ్యన వరుసగా కథా ప్రాధాన్యత కలిగిన సినిమాలనే ఎంపిక చేసుకుంటూ వస్తున్న సమంత ‘రంగస్థలం’ ‘ఓ బేబీ’ వంటి చిత్రాలతో అభిమానులను అలరించింది. గతేడాది ‘జాను’ చిత్రంతో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఆ చిత్రం పెద్దగా ఆడలేదు. ఇక ‘ఫ్యామిలీ మెన్2’ వెబ్ సిరీస్ తో ఈ సమ్మర్ కు సందడి చేయబోతుంది సమంత.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.