బిగ్ బాస్4: శనివారం రాదు.. ఆదివారం రచ్చే..!

బిగ్ బాస్ సీజన్ 4 షో ని అక్కినేని వారి కోడలు సమంత హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ కింగ్ నాగార్జున షూటింగ్ లో ఉండటం వల్ల.. బిగ్ మేడమ్ గా సమంత షోని లీడ్ చేయబోతోంది. అయితే, చాలామంది శనివారమే వస్తుంది అనుకున్నారు కానీ, ఇప్పుడు శనివారం కాదు, ఆదివారం వస్తుందట. అందులోనూ మూడుగంటల పాటు షోని లీడ్ చేస్తూ హౌస మేట్స్ తో ఒక ఆట ఆడుకుంటుంది అంటున్నారు.

ఆదివారం సాయంత్రం 6గంటల నుంచి బిగ్ బాస్ స్పెషల్ షో స్టార్ట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. నిజానికి మనం శని-ఆదివారాలు హౌస్ మేట్స్ తో హోస్ట్ సందడి చేయడం అనేది చూసాం. అయితే, ఇది కొత్తగా ఉంటుందని అంటున్నారు. అంతేకాదు, తమిళంలో హిందీలో ఈసారి చాలా ప్రయోగాలు చేసారు. హిందీలో ఈసారి ఎలిమినేషన్ అనేది లేకుండా ఇన్ విజబుల్ అంటూ హౌస్ మేట్స్ కి టీషర్ట్స్ వేసి వాళ్లు అక్కడ లేనట్లుగా మిగతా వాళ్లు గేమ్ ఆడేలా కొత్తప్రయోగం చేసారు. అలాగే తమిళంలో హౌస్ మేట్స్ తోనే ఒకర్ని ఎలిమినేట్ చేయించేశారు. పబ్లిక్ ఓటింగ్ పెట్టకుండా కేవలం హౌస్ మేట్స్ ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ చేశారు.

ఇప్పుడు ఇలాంటి ప్రయోగమే తెలుగులో కూడా చేస్తారని అంటున్నారు. అందులోనూ కొత్త హోస్ట్ గా సమంత వస్తోంది కాబట్టి ఈసారి ఎలిమినేషన్ వినూత్నంగా ఉండబోతోందట. అంతేకాదు, దసరా పండగ సందర్భంగా కొత్త గెస్ట్ ని కూడా తీస్కుని రాబోతోందని చెప్తున్నారు. మరి సమంత ఈసారి ఎవర్ని ఎలిమినేట్ చేస్తుంది అనేది ఆసక్తికరం. ఇక మరోసైడ్ ఎలిమినేట్ అయిన పార్టిసిపెంట్స్ లో జోర్ధార్ సుజాతని రీ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని టాక్ కూడా వినిపిస్తోంది. ఈ సస్పెన్స్ వీడాలంటే మనం ఆదివారం వరకూ ఆగాల్సిందే. అదీ మేటర్.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Share.