సమంత భర్తను అంత మాట అనేసిందేంటీ?

టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ గా ఉన్నారు సమంత,నాగ చైతన్య. ఏమాయ చేశావే అనే రొమాంటిక్ లవ్ మూవీతో కల్సిన ఈ ఇద్దరి ప్రయాణం పెళ్లివరకు వెళ్ళింది. చైతు పట్టుబట్టి మరీ సమంత చేయి అందుకున్నాడు. పెళ్లి అయినా వీరిద్దరూ ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకుంటారు. పెళ్లి అయినా కూడా సమంత వరుసగా సినిమాలు చేస్తుంది. ఆ ఫ్రీడమ్ చైతు ఆమెకు ఇవ్వడం జరిగింది. మరి ప్రేమ అంటే అదే కదా. ఈ అక్కినేని వారి కోడలు చర్యలు కూడా కొంచెం ఊహాతీతం గానే ఉన్నాయి.

ఆమె తాజా ఇంస్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అలాగే చైతూ పై ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏమి జరిగిందంటే… రానా-విహిక ల రోకా వేడుక జరుగగా దానికి సమంత, నాగ చైతన్య కూడా హాజరయ్యారు. ఆ వేడుకలో చైతూ ఫోటో తీసిన సమంత ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి చిత్రమైన కామెంట్ పెట్టింది. ‘అమ్మ, ఆంటీలు, చెల్లెల్లు, స్నేహితులు అందరిని పంపిన తరువాత ఇప్పుడే ఇన్ స్టాగ్రామ్‌కు సమయం చిక్కింది.

నా భర్త చాలా హ్యాండ్సమ్‌గా వున్నాడు చూడండి. నా భర్త ప్రస్తుతం ఎక్కడో ఒక పెద్ద గొయ్యి తవ్వి అందులో దూకేసి ఉంటాడు’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇంతకీ సమంత భర్త అందాన్ని పొగిడిందా, ఎగతాళి చేసిందో అర్థం కాక నెటిజెన్స్ తలలు పట్టుకుంటున్నారు. కొత్త జంట మధ్యలో ఇలాంటి చిలిపి సరదాలు మామూలే అని కొందరు కామెంట్ చేస్తున్నారు.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Share.