పడక గది విషయాలు చెప్పి షాక్ ఇచ్చింది!

ఇటీవల ‘ఫీట్ అప్ విత్ ది స్టార్స్’ అనే షో మొదలైంది. ఈ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తుంది లక్ష్మీ మంచు. ఈ షో స్పెషాలిటీ ఏంటంటే.. ఈ షో కి గెస్ట్ గా వచ్చిన సెలబ్రిటీని మంచం పై ఇంటర్వ్యూ చేస్తుంది లక్ష్మీ. ఈ షోలో సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువ ప్రశ్నలు ఉంటాయట. మొదటగా ఈ షోలో అక్కినేని కోడలు పాల్గొంది. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు.

lakshmi-manchu-to-host-feet-up-with-the-stars-in-telugu1

అందులో సమంత తన బెడ్ రూమ్ విషయాలు చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది.సమంత మాట్లాడుతూ..”నాగచైతన్యకి మొదటి భార్య ఉంది. ఇంతకీ మొదటి భార్య అంటే ఎవరో తెలుసా..? పిల్లో(తలగడ)…!చైతూ నిద్రపోయే సమయంలో ఆ పిల్లో పక్కన పెట్టుకొని పడుకుంటాడు. చైతూని ముద్దు పెట్టుకోవాలన్నా.. మధ్యలో ఆ పిల్లో అడ్డు వస్తుంటుంది” అంటూ చెప్పుకొచ్చింది. ఇక పెళ్ళికి ముందు సామ్, చైతూ లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండేవారని కూడా తెలిపింది.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Share.