మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిన సమంత….!

ఈ ఏడాది ‘జాను’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన సమంత.. ప్రస్తుతం తమిళంలో నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రంలో ప్రాముఖ్యత ఉన్న పాత్రను పోషిస్తుంది. దీంతో పాటు తాజాగా.. ‘ది ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సీరీస్ లో కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తుంది. ఇదిలా ఉండగా..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఓ చిత్రంలో కూడా సమంత నటించబోతున్నట్టు తాజా సమాచారం.త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ ఎన్టీఆర్ తో ఉండబోతున్నట్టు ఇదివరకే నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయిన తరువాత ఎన్టీఆర్- త్రివిక్రమ్ సినిమా మొదలుకాబోతుంది.

ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని టాక్. ఈ క్రమంలో సమంతను కూడా ఓ హీరోయిన్ గా ఎంచుకోవాలని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నట్టు తెలుస్తుంది.ఈ నేపథ్యంలో ఆమెతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టు సమాచారం.సినిమాలో తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటే కచ్చితంగా సమంత ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి. గతంలో త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అత్తారింటికి దారేది’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ‘అఆ’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో సమంత హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Share.