కొత్త కథలకు నో చెబుతున్న సమంత.. ఎందుకంటే..?

ఏ మాయ చేశావె సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టి ఆ సినిమాతో సమంత నిజంగానే మాయ చేసేసింది. సమంత నటించిన తొలి సినిమానే సూపర్ హిట్ కావడంతో ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. స్టార్ హీరోలతో సమంత నటించిన బృందావనం, దూకుడు సినిమాలు హిట్ కావడంతో పాటు సమంతకు స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందించాయి. 2009 సంవత్సరంలో హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టిన సమంత ఇప్పటికీ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.

అయితే గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో సమంత సినిమాలకు దూరం కానున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం గుణశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న శాకుంతలం సినిమాలో శకుంతల పాత్రలో సమంత నటిస్తున్నారు. శాకుంతలం సమంత నటిస్తున్న తొలి పౌరాణిక చిత్రం కాగా ఈ సినిమాలో దుశ్యంతుడిగా మలయాళ హీరో నటించబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు కాతువక్కల్ రెండు కాదల్ అనే తమిళ సినిమాలో సమంత నటిస్తున్నారు.

దర్శకనిర్మాతలు సమంతతో సినిమాలు తీయాలని ఆసక్తి చూపిస్తున్నా సమంత మాత్రం కొత్త కథలను వినడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. సమంత కొత్త కథలను వినకపోవడంతో వైవాహిక జీవితంపై దృష్టి పెట్టే ఉద్దేశంతో సమంత సినిమాలకు దూరం కావాలని నిర్ణయం తీసుకున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. సమంత స్పందిస్తే మాత్రమే ఈ ప్రచారంలో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంది. నాగచైతన్య సమంత పెళ్లి సమయంలో సైతం సమంత సినిమాలకు దూరం కానున్నారంటూ వార్తలు వచ్చాయి.

అయితే అందరి ఊహలకు భిన్నంగా పెళ్లి తరువాత కూడా వరుసగా సినిమాల్లో నటించి సమంత విజయాలను సొంతం చేసుకున్నారు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో నటిస్తూ, సామ్ జామ్ టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరించి సమంత అభిమానులకు మరింత చేరువయ్యారు. సమంత నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ సమ్మర్ లో విడుదల కానుంది.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.