సైరా బాలీవుడ్ ప్రమోషన్స్ కి సల్లూ భాయ్ అభయహస్తం

అక్టోబర్ 2న, “సైరా నరసింహా రెడ్డి” ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదలవుతున్న విషయం తెలిసిందే. హిందీలో ఈ చిత్రాన్ని ఫర్హాన్ అక్తర్ కొనడంతో ఈ చిత్రం మంచి ప్రాముఖ్యత సంతరించుకొంది. అయితే.. ఈ చిత్రం హిందీలో సూపర్ హిట్ అవ్వాలంటే రీచ్ ఎక్కువగా ఉండాలి. అందుకే.. రామ్ చరణ్ తన బాలీవుడ్ క్లోజ్ ఫ్రెండ్ అయిన సల్మాన్ ను సహాయం కోరాడు. సల్మాన్ ఖాన్ కొత్త సినిమా “దబాంగ్ 3″కి చిరంజీవి & చరణ్ ఇక్కడ సపోర్ట్ చేయడానికి సమ్మతించగా.. సల్మాన్ ఖాన్ “సైరా” బాలీవుడ్ ప్రమోషన్స్ కి ఆసరా ఇస్తానన్నాడట.

salman-khan-to-support-chiranjeevis-sye-raa-movie1

ఏకంగా బాలీవుడ్ కింగ్ ఖాన్ సపోర్ట్ సైరాకీ దొరకడంతో చిరు & టీం చాలా ఆనందంగా ఉన్నారట. మరి సల్మాన్ సపోర్ట్ సినిమాకి ఎంతవరకు యూజ్ అవుతుంది? ఓపెనింగ్స్ & రివ్యూస్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే.. సైరా ఇన్సైడ్ రిపోర్ట్స్ మాత్రం అదిరిపోయాయి. సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అని అందరూ ఫిక్స్ అయిపోయారు.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Share.