సాయి పల్లవి రియల్ లైఫ్ సీక్రెట్ చెప్పి షాకిచ్చిందట….!

పెద్దగా గ్లామర్ షో చేయకుండానే చాలా మందికి ఫేవరెట్ హీరోయిన్ అయిపొయింది సాయి పల్లవి. ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన ఈ బ్యూటీ… ఆ చిత్రంలో తన నటనతో కొత్త ట్రెండ్ సెట్ చేసింది. హీరోయిన్ అంటే మితి మీరిన గ్లామర్ షో చేస్తేనే కానీ క్రేజీ హీరోయిన్ అయ్యే అవకాశం ఉండడు అనే సెంటిమెంట్ కు ఈమె బ్రేకులు వేసింది. తెలంగాణ స్లాంగ్ లో ఈమె పలికిన డైలాగ్స్ కు చాలా మంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు.

మోహం పై పింపుల్స్ ఉన్నప్పటికీ అమ్మాయిలు ఇంత కళ కళ లాడుతుంటారా అనడానికి సాయి పల్లవి నిర్వచనంగా మారింది. సినిమాలో తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటేనే సినిమా ఓకే చేస్తుంది. లేకపోతే ఓకే చెయ్యదు. ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చినా.. అది ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే ఈమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వదు. అందుకే ఈమెకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ.. తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని తెలిపింది.

23-Sai Pallavi

ఆమె మాట్లాడుతూ…”ఒక వేళ నేను నటిని కాకుంటే ఎంబీబీఎస్‌ తరవాత కార్డియాలజీ ఎంచుకుని కార్డియాలజీస్ట్ అయ్యేదానిని. మాది తమిళనాడులోని బడుగ అనే గిరిజన తెగ. మా భాష బడుగకు లిపి లేదు… నా గురించి తెలియని వాళ్లకి ఇది కొత్త విషయం” అంటూ తెలిపింది. ఇక మీరు ఎప్పుడైన ఏడ్చారా.. అని ప్రశ్నించగా..’ ‘ఎన్జీకే’ సినిమా టైములో ఓ సీన్‌నే పదే పదే రీషూట్‌ చేస్తుండేవారు ఆ చిత్రం దర్శకుడు. దాంతో ఒకరోజు ‘నేను సినిమాలను వదిలేస్తానని’ అమ్మకు చెప్పి ఇంట్లో ఏడ్చేశాను’ అంటూ చెప్పుకొచ్చింది.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Share.