ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాకే నొ చెప్పిందట..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టినట్టు ఇన్సైడ్ టాక్. మరో పక్క రానాతో కలిసి ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్లో కూడా నటిస్తూ పవన్ బిజీగా గడుపుతున్నాడు. ఇదిలా ఉండగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ కూడా వెనకడుగు వెయ్యదు. ఎగిరి గంతేసి మరి ఓకే చెప్పేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.

అయితే మన రౌడీ బేబీ సాయి పల్లవి మాత్రం ఆ ఆఫర్ కు సున్నితంగా నొ చెప్పిందట. వివరాల్లోకి వెళితే… పవన్- రానా కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రంలో సాయి పల్లవికి ఛాన్స్ వచ్చిందట. పవన్ భార్య పాత్రలో ఆమె కనిపించాల్సి ఉంటుంది. అయితే ఈ పాత్ర నిడివి సినిమాలో తక్కువగా ఉందని భావించి ఆమె నొ చెప్పినట్టు టాక్. కానీ పైకి మాత్రం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వలన చెయ్యలేను అని సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తుంది.

సాధారణంగా సాయి పల్లవి నటించే సినిమాల్లో ఆమె పాత్రకు సరైన ప్రాముఖ్యత లేకపోయినా..డామినేటింగ్ గా అనిపించినా, ఎక్కువ ముద్దు సీన్లు ఉన్నా అస్సలు ఒప్పుకోదు. గతంలో ‘డియర్ కామ్రేడ్’ ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి చిత్రాలను కూడా ఈమె అలాగే పక్కన పెట్టేసింది. ఇక పవన్-రానా ల ప్రాజెక్ట్ ను ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తుండగా సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.