మళ్ళీ అలాంటి పాత్రే.. సాయి పల్లవి రిస్క్ చేస్తుందా?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ‘మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ మరియు ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ సంస్థల పై నిరంజన్ రెడ్డి, రాంచరణ్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నిహారిక కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో రాంచరణ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఓ కీలకమైన ఎపిసోడ్ లో చరణ్ పాత్ర ఉంటుందని కొరటాల శివ చెప్పుకొచ్చాడు.

ఈ పాత్ర వల్లే కథ మొత్తం మలుపు తిరుగుతుందని కూడా ఆయన చెప్పుకొచ్చాడు. అయితే చరణ్ పాత్రకు కూడా ఓ హీరోయిన్ కావాల్సి ఉందట. ఈ పాత్ర కోసం ముందుగా రష్మిక ను అనుకున్నారట. కథ ప్రకారం ఈ చిత్రంలో చరణ్ ఓ నక్సలైట్ గా కనిపించాల్సి ఉందట. అతనికి జోడీగా నటించే హీరోయిన్ పాత్ర కూడా నక్సలైట్ గానే కనిపించాల్సి ఉందట. దాంతో రష్మిక ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తుంది. దీంతో ఇప్పుడు సాయి పల్లవిని ఆ పాత్ర కోసం తీసుకున్నట్టు సమాచారం.

Sai Pallavi in Chiranjeevi's Acharya movie1

ఈ చిత్రంలో ఆమెది కూడా కీలక పాత్ర కాబట్టి .. వెంటనే ఓకే చెప్పేసినట్టు తెలుస్తుంది. సాయి పల్లవిని తీసుకుంటే.. ‘ఆచార్య’ కు కచ్చితంగా అదనపు ఆకర్షణ చేకూరుతుంది అనడంలో సందేహం లేదు. అయితే ఆమె ఆల్రెడీ ‘విరాటపర్వం’ లో కూడా నక్సలైట్ పాత్రనే చేస్తుంది. ఈ రెండు చిత్రాల్లోనూ ఆమె పాత్ర చనిపోతుందట. వరుసగా ఇలాంటి పాత్రలు చెయ్యడం ఆమె కెరీర్ కు రిస్కేమో అని కొందరి అభిప్రాయం.

Most Recommended Video

భానుమతి & రామకృష్ణ సినిమా రివ్యూ & రేటింగ్!
సినిమాల్లోకి రాకముందు మన హీరోయిన్స్ ఎలా ఉంటారో చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!
అట్టర్ ఫ్లాప్ సీజన్ అంటే ఇదేనేమో..!

Share.