మహేష్ మాట్లాడితే.. శర్వా మాట్లాడకూడదా..?

యంగ్ హీరో శ‌ర్వానంద్ నటిస్తోన్న కొత్త సినిమా ‘శ్రీ‌కారం’‌. కిశోర్ బి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంకా అరుళ్ మోహ‌న్ కనిపించనుంది. 14 రీల్స్ ప్లస్‌ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌హా శివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న ఈ సినిమాను థియేట‌ర్లలో విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సినిమా రైతులకు సంబంధించిన కథ. ఈ మధ్యకాలంలో ఈ జోనర్ లో చాలా సినిమాలు వచ్చాయి.

‘మహర్షి’ సినిమాలో మహేష్ బాబు కూడా రైతుల గురించే మాట్లాడారు. ఆ కథకీ.. ‘శ్రీకారం’ కథకీ లింక్ ఉందని.. రెండూ ఒకేలా సాగే కథలంటూ ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై చిత్ర రచయితే సాయి మాధవ్ బుర్రా స్పందించారు. ‘మహర్షి’, ‘శ్రీకారం’ రెండు వేర్వేరు కథలని.. అయితే రెండు సినిమాలు కూడా రైతుల గురించే మాట్లాడామని.. మహేష్ బాబు రైతుల గురించి మాట్లాడితే.. శర్వా మాట్లాడకూడదా..? అంటూ ప్రశ్నించారు. రైతుల గురించి అందరూ మాట్లాడుకోవాలని..

ఈ కథలో కూడా రైతుల సమస్యల గురించి మాట్లాడామని చెప్పారు. ఈ సమాజానికి ఇలాంటి కథ ఎంతో అవసరమని.. ఈ సినిమాతో చాలా శక్తివంతమైన సంభాషణలు రాసే అవకాశం దక్కిందని చెప్పారు. మనందరిలో ఓ రైతు ఉన్నాడని.. యువతరం వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పే కథ ‘శ్రీకారం’ అని చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.