తన పెళ్ళి పై క్లారిటీ ఇచ్చిన తేజు

ఓ అరడజను ప్లాపులు తరువాత ‘చిత్రలహరి’ చిత్రంతో హిట్టందుకున్నాడు సాయి తేజ్. మొదట్లో ఈ హీరో దూకుడు చూసి చరణ్, అల్లు అర్జున్ రేంజ్ లో రాణిస్తాడని అంతా అనుకున్నారు. కానీ మొదటి మూడు హిట్లు నిర్మాతల క్రెడిట్ అని తరువాత చేసిన ఫలితాలు గుర్తుచేశాయి. ఏదైతేనేం మొత్తానికి హిట్టు ట్రాక్ ఎక్కాడు. ‘ఇప్పటి నుండీ కథల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి, కాస్త ఆలస్యమైనా తనని మరో మెట్టు పైకి ఎక్కించే సినిమాలు చేయాలనే పట్టుదలతో ఉన్నానని…. కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ యువ దర్శకుల కథలను వింటున్నాని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చాడు. అంతేకాదు తనపై వచ్చే పుకార్ల గురించి కూడా స్పందించాడు.

sai-dharam-tej-makes-clarity-about-his-marriage1

తేజు మాట్లాడుతూ.. “సినిమాల్లోకి రావడానికి ముందే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. కానీ ఆ ప్రేమకి బ్రేకప్ జరిగిపోయింది. ఆ అమ్మాయికి వేరెవరితోనో పెళ్ళి కూడా జరిగిపోయింది. నేను సినిమాల్లోకి వచ్చిన తరువాత ఫలానా హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడంటూ పుకార్లు షికారులు చేశాయి. ఇప్పటికీ నాపై ఈ పుకార్లు వస్తూనే వున్నాయి. నేను సినిమా చేసే ప్రతి హీరోయిన్ తోను క్లోజ్ గానే వుంటాను. రాశి ఖన్నా .. రకుల్ .. రెజీనా వీళ్ళంతా ఆ లిస్ట్ లో కనిపిస్తారు. అందువలన వాళ్ళతో ప్రేమలో ఉన్నానంటూ ప్రచారం జరుగుతూ వచ్చింది. నిజానికి మేమంతా మంచి స్నేహితులం. నా పెళ్ళితో ఈ పుకార్లకు తెరపడుతుందేమో. కెరియర్ పరంగా సెటిల్ కాగానే పెళ్ళి చేసేసుకుంటాను” అంటూ చెప్పుకొచ్చాడు.

Share.