క్రేజీ డైరెక్టర్ తో తమిళ ఎంట్రీ సిద్ధం చేసుకున్న సాయి

“చిత్రాలహరి”తో ఫ్లాపుల పరంపర నుంచి బయటపడిన సాయితేజ్.. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో “ప్రతిరోజూ పండగ” సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టి మళ్ళీ బ్యాక్ టు ఫార్మ్ రావాలని దర్శకుడు మారుతి, హీరో సాయితేజ్ తపిస్తున్నారు. అందుకే.. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేస్తున్నారు. ఈ సినిమా అనంతరం సాయితేజ్ మన దేవా కట్ట దర్శకత్వంలో ఒక ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్ టైనర్ చేయనున్నాడని టాక్ ఉన్నప్పటికీ.. ఆ సినిమా కంటే ముందు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ తెలుగు-తమిళ బైలింగువల్ చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు సాయితేజ్.

sai-dharam-tej-getting-ready-for-his-tamil-debut1

అనిల్ సుంకర నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది మొదలవ్వనుంది. హిలేరియన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో సాయితేజ్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. టిపికల్ స్క్రీన్ ప్లే స్పెషలిస్ట్ అయిన వెంకట్ ప్రభు.. ఈ చిత్రం కోసం చాలా వెరైటీ వెర్షన్ ను రెడీ చేసి అందరి చేత ఒకే చేయించాడట. మరి సాయితేజ్ కు ఈ ప్రయోగం ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

Share.