గాయాలు పాలైన రజినీ కూతురు..!

సౌత్ ఇండియన్ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కిన ‘కబాలి’ చిత్రం సినిమాతో అందరినీ ఆకట్టుకుంది సాయి ధన్సిక. ఈ చిత్రంలో రజినీ కూతురిగా, యోగి అనే పాత్రలో ధన్సిక నటనకు కోలీవుడ్ లో మాత్రమే కాకుండా టాలీవుడ్ లో కూడా ఫ్యాన్స్ ను సంపాదించుకుంది ధన్సిక . దాంతో ఫ్రస్తుతం నేరుగా తెలుగులో ‘వాలు జడ’ అనే చిత్రంలో నటిస్తుంది. ఇక ఈ చిత్రంతో పాటు తమిళ్‌లో ‘యోగి డా’ అనే చిత్రంలో కూడా నటిస్తూ బిజీగా అంది ధన్సిక. అయితే తాజాగా ఈ చిత్ర షూటింగ్‌లో ప్రమాదం జరగడంతో ధన్సికకు గాయాలయ్యాయట.

ఈ చిత్ర షూటింగ్ లో భాగంగా.. బార్‌లో ఓ యాక్షన్ సీన్లను చిత్రీకరించారు. అయితే ఈ చిత్రీకరణ సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. ముఖ్యంగా కొంత మంది రౌడీ గ్యాంగ్ ధన్సిక పై బీర్‌ బాటిల్స్ ను విసిరే సీన్ షూట్ చేస్తున్నప్పుడు పగిలిన గాజు ముక్క ఒకటి ధన్సిక కంటి కింది భాగంలో గుచ్చుకుందట. దీంతో వెంటనే స్పందించిన చిత్ర యూనిట్ సభ్యులు ఆమె దగ్గరలోని హాస్పిటల్‌కు తరలించారట. ప్రస్తుతం ధన్సిక ట్రీట్‌మెంట్ పూర్తి అయిన తరువాత తిరిగి షూటింగ్ లో పాల్గొనేందుకు ధన్సిక ప్రత్నిస్తున్నట్టు తెలుస్తోంది. గాయాలు పాలైనప్పటికీ లెక్క చేయకుండా షూటింగ్ పట్ల తనకున్న శ్రద్ధకి చిత్ర యూనిట్ గర్వపడుతున్నట్టు చెప్పుకొస్తున్నారు చెన్నై ఫిలిం విశ్లేషకులు

Share.