షాకిస్తున్న ‘సాహో’ ప్రీ రిలీజ్ బిజినెస్… ప్రభాస్ స్టామినా అంతుందా?

‘బాహుబలి’ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏకంగా 350 కోట్ల బడ్జెట్ అయ్యింది అని ఇటీవల ప్రభాస్ తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ‘ఓ కొత్త దర్శకుడిని నమ్మి నిర్మాతలు ఇంత బడ్జెట్ ఎలా పెట్టారు. కనీసం అతను రాజమౌళి కూడా కాదే. నిర్మాతలు అంత డబ్బు పెట్టినంత మాత్రాన.. డిస్ట్రిబ్యూటర్లు అంతంత రేట్లకి కొంటారా?’ ఇవి ప్రస్తుతం ‘సాహో’ చిత్రం పై జరుగుతున్న డిస్కషన్లు.

saaho-pre-release-business-stuns-everyone1

అయితే అనుమానాలన్నిటికీ కౌంటర్ ఇచ్చేలా.. ఇప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్లో జరుగుతుంది. ‘సాహో’ ప్రీరిలీజ్ బిజినెస్ లో సత్తా చాటుతోంది. ‘సాహో’ చిత్రానికి పెట్టిన పెట్టుబడి మొత్తం… రాబడుతుందని బయ్యర్స్ కు కూడా నమ్మకంగా ఉన్నారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. ఇప్పటి వరకూ ఈ చిత్రానికి 330 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రానికి 125 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలు మొత్తం కలిపి రూ.46 కోట్లు .. హిందీ వెర్షన్ రూ.120 కోట్ల వరకూ అమ్మకాలు జరిగాయట. ఇక ఓవర్సీస్ లో ఇప్పటివరకూ ఈ చిత్రానికి రూ.42 కోట్ల వరకు బిజినెస్ జరిగిందట. ఇవి కాకుండా సినిమా శాటిలైట్, డిజిటల్, ఆడియో రైట్స్ రూపంలో భారీ మొత్తం వచ్చే ఛాన్స్ ఉందని కూడా తెలుస్తుంది. ఏమాత్రం సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా ప్రభాస్ ఇండియన్ సూపర్ స్టార్ అయిపోవడం ఖాయం. అలాగే ఏమాత్రం టాక్ తేడా కొట్టినా… ఇప్పటి వరకూ ఇండియన్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో టాప్ 1 గా ఉన్న ‘మహోజాదారో’ రికార్డును కూడా బ్రేక్ చేసే అవకాశం ఉందనడంలో సందేహం లేదు.

Share.