ప్రభాస్ తో సుజీత్ కొట్టించిన సిక్సర్ స్టేడియం దాటేసింది

“బాహుబలి”తో తెలుగులో మాత్రమే కాక తమిళ, హిందీ, మలయాళం భాషల్లోనూ భారీ మార్కెట్ ను ఏర్పరుచుకున్న ప్రభాస్ నటించిన తాజా చిత్రం “సాహో”. “రన్ రాజా రన్” లాంటి ఒక డీసెంట్ హిట్ అనంతరం దాదాపుగా అయిదేళ్లపాటు వెయిట్ చేసి మరీ ప్రభాస్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అల్ట్రా స్టైలిష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ సంస్థ దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందించింది. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, ఎవ్లీన్ శర్మ, మహేష్ మంజ్రేకర్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

saaho-movie-trailer-review1

ఆల్రెడీ విడుదలైన టీజర్ ఎంతటి సునామీ సృష్టించిందో తెలిసిందే. అయితే.. చిన్నపాటి గ్రాఫికల్ గ్లిట్చ్ కారణంగా కాస్త నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది ఆ టీజర్ కి. ఆ చిన్నపాటి నెగిటివిటీని తుడిచిపెట్టేయడమే కాక.. అంచనాలను విశేషంగా పెంచేసింది ఇప్పుడే విడుదలైన “సాహో” ట్రైలర్. ” గల్లీలో సిక్సర్ ఎవడైనా కొడతాడు.. స్టేడియంలో కొట్టేవాడికే ఒక రేంజ్ ఉంటుంది” అని ప్రభాస్ చెప్పే డైలాగ్ ను బట్టే ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఎంత డేరింగ్ & డాషింగ్ అనేది బాగా ఎస్టాబ్లిష్ చేసాడు సుజీత్. ప్రభాస్ కెరీర్ లో ఫస్ట్ టైం పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు.

saaho-movie-trailer-review2

“బాహుబలి” అనంతరం ఈ సినిమాలో ప్రభాస్ తన సిక్స్ ప్యాక్ బాడీని చూపించనున్నాడు.. అది కూడా షర్ట్ లెస్ పోజ్ తో. నిర్మాణ విలువలు భారీగా ఉన్నాయి. లెక్కకుమిక్కిలి హిందీ ఆర్టిస్టులు ఉండడం అనే చిన్నపాటి మైనస్ ను పక్కన పెడితే.. ట్రైలర్ హాలీవుడ్ లెవల్లో ఉందనే చెప్పాలి. సినిమా కథ ఏమిటనేది కూడా క్లుప్తంగా చెప్పేసి.. అనవసరమైన కన్ఫ్యూజన్స్ కి తెరదించాడు సుజీత్. ట్రైలర్ కంటెంట్ & ట్రైలర్లో ప్రభాస్ కటౌట్ చూస్తుంటే “సాహో” బ్లాక్ బస్టర్ మాత్రమే కాదు “బాహుబలి” రేంజ్ హిట్ అవ్వడం కూడా ఖాయమని అర్ధమవుతొంది.

Share.