ఇంత రొటీన్ స్టోరీ తో ‘సాహో’ తీసారా?

ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘సాహో’ హడావిడే ఎక్కువ కనిపిస్తుంది. సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇటీవల సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు/ఎ సర్టిఫికెట్‌ ను పొందింది. ఈ చిత్రంలోని ప్రతీ విజువల్ అద్భుతంగా ఉందంటూ సెన్సార్ సభ్యులు తెలిపారు. ఓవర్ ఆల్ గా ఈ చిత్రం ఆకట్టుకునే విధంగా ఉందని చెప్పుకొస్తున్నారు. అయితే ఈ చిత్రం కథ ఇదే అంటూ కొన్ని కథనాలు బయటకొస్తున్నాయి.

saaho-ye-chota-nuvvunna-song-teaser

వివరాల్లోకి వెళితే… ‘సాహో’ బ్యాంక్ రాబరీ నేపథ్యంలో కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కినట్టు ట్రైలర్స్ ను బట్టి స్పష్టమవుతుంది. దీంతో ఈ చిత్రం కథ గతంలో వచ్చిన శంకర్, అర్జున్‌ల ‘జెంటిల్ మేన్’, రవితేజ ‘కిక్’ చిత్రాల తరహాలో ఉంటుందని తెలుస్తుంది. హీరో దొంగలా ఎందుకు మారాడు. దానికి గల పరిస్థితుల నేపథ్యంలోనే ‘సాహో’ సినిమాను సుజీత్ తెరకెక్కించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంత రొటీన్ స్టోరీ తో ‘సాహో’ తీసారా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకూ నిజముందో తెలియాల్సి ఉంది.

Share.