పెళ్ళికి సిద్దమైన డైరెక్టర్ సుజీత్!

మరో టాలీవుడ్ యంగ్ బ్యాచ్ లర్ పెళ్లికి సిద్ధమయ్యారు. ఇప్పటికే హీరో నిఖిల్ డాక్టర్ పల్లవిని పెళ్లి చేసుకోగా, హీరో నితిన్ నిషా తో, రానా మిహికా బజాజ్ తో పెళ్ళికి సిద్ధంగా ఉన్నారు. కాగా యంగ్ డైరెక్టర్ సుజీత్ కూడా పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. ఆయనకు తన గర్ల్ ఫ్రెండ్ ప్రవల్లికను పెళ్లి చేసుకోనున్నాడు. వీరిద్దరికీ జూన్ 10న ఎంగేజ్మెంట్ జరగనుంది. ఇక ప్రవల్లిక వృత్తి రీత్యా డాక్టర్ అని తెలుస్తుంది.

అలాగే ఆమె టిక్ టాక్ సింగింగ్ వీడియోలలో కూడా బాగా ఫేమస్ అని తెలుస్తుంది. కొంత కాలం క్రితం వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందట. వీరిద్దరు పెద్దల అనుమతితో పెళ్లి చేసుకోనున్నారు.ఇది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని సమాచారం. ఎంగేజ్మెంట్ అనంతరం తొందరలోనే వీరి పెళ్లి ముహూర్తం ఉంటుందని వినికిడి. 2014లో వచ్చిన రన్ రన్ రాజా రన్ చిత్రంగా 23ఏళ్ల వయసులో సుజీత్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు.

గత ఏడాది ప్రభాస్ తో సాహో అనే భారీ పాన్ ఇండియా మూవీ తెరకెక్కించిన సుజీత్, ప్రస్తుతం చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనులలో ఉన్నారు. చిరంజీవి మలయాళ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ లో నటించాల్సి ఉండగా ఆ మూవీ దర్శకత్వ బాధ్యతలు చిరంజీవి సుజీత్ అప్పగించారు. లూసిఫర్ స్క్రిప్ట్ కి తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా సుజీత్ మార్పులు చేస్తున్నారు.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Share.