రాజమౌళి ప్లాన్ ఇదే!

దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వలన వాయిదా పడింది. రీసెంట్ గా ఈ సినిమాను దసరా కానుకగా.. అక్టోబర్ 13న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. దానికి తగ్గట్లే సినిమా షూటింగ్ ను ప్లాన్ చేసుకున్నాడు రాజమౌళి. వచ్చే నెలలోపు షూటింగ్ మొత్తం పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ మొదలు పెట్టాలని అనుకున్నాడు. కానీ ఇప్పుడు షూటింగ్ ఏప్రిల్, మే వరకు పూర్తయ్యేలా కనిపించడం లేదు.

దానికి కారణం.. రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కి గ్యాప్ ఇచ్చి.. ‘ఆచార్య’ షూటింగ్ లో పాల్గొనడమే. ‘ఆచార్య’ షూటింగ్ లో రామ్ చరణ్ పార్ట్ వచ్చే నెలకి పూర్తవుతుంది. ఆ తరువాత ‘ఆర్ఆర్ఆర్’ సెట్స్ పైకి వస్తాడు చరణ్. దానికి తగ్గట్లే రాజమౌళి ఏప్రిల్, మే నెలల్లో రామ్ చరణ్ పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అలానే రామ్ చరణ్, అలియా భట్ లపై రెండు పాటలను షూట్ చేయనున్నారు.

అక్కడితో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఏప్రిల్ నెలలో ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొనాల్సిన అవసరం ఉండకపోవచ్చు. వచ్చే నెలలోనే ఎన్టీఆర్ పోర్షన్ మొత్తం పూర్తవుతుందని అంటున్నారు. కానీ ప్యాచ్ వర్క్ పూర్తయ్యే వరకు ఎన్టీఆర్ వెయిట్ చేయాలి. ఆ తరువాత త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్లగలడు. బహుశా.. మే లేదా జూన్ నెలలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉంది.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.