చరణ్, ఎన్టీఆర్ లకు కొత్త సమస్య వచ్చి పడిందే..!

రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. ఇప్పటికే చరణ్, ఎన్టీఆర్ లకు గాయాలవడంతో రెండు నెలల పాటు షూటింగ్ వాయిదా పడింది. ఇక దీంతో పాటు ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ కూడా ఇంకా ఫిక్సవ్వలేదు. సో దీని ఎఫెక్ట్ రిలీజ్ డేట్ పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని అభిమానులు సైతం టెన్షన్ పడుతున్నారు. ఈ చిత్రాన్ని 2020 జులై 30 న విడుదల చేయబోతున్నట్టు దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య ప్రకటించారు.

ఇదిలా ఉండగా.. ఇక చరణ్, ఎన్టీఆర్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయిన తరువాత ఎవరి డైరెక్షన్లో చేయబోతున్నారు అనేది చర్చనీయాంశం అయ్యింది. ఈ ఇద్దరి హీరోలకి కొరటాల శివ డైరెక్షన్లో చేయాలని అనుకుంటున్నారట. ‘జనతా గ్యారేజ్’ తరువాత కొరటాల శివ డైరెక్షన్లో మరో చిత్రం చేస్తానని ఎన్టీఆర్ ఎప్పుడో మాటిచ్చాడట. ఇక చరణ్, కొరటాల కాంబినేషన్లో సినిమా ఇప్పటికే 2 సార్లు పూజా కార్యక్రమాలు జరుపుకుని సెట్స్ పైకి వెళ్ళకుండా ఆగిపోయింది. ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయ్యే లోపు చరణ్ మెగాస్టార్ చిత్రం పూర్తి చేస్తాడు. అయితే వెంటనే రెండు సార్లు మెగా హీరోతో చేయడమెందుకు అని ఎన్టీఆర్ తోనే సినిమా చేయాలనుకుంటున్నాడట. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి..!

Share.