RRR Making Video: ఆర్ఆర్ఆర్ గ‌ర్జ‌న‌.. బాహుబలిని మించేలా!

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ మేకింగ్ వీడియో ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ వీడియో ద్వారా రాజమౌళి మరోసారి అక్టోబర్ 13వ తేదీనే ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజవుతుందని స్పష్టం చేశారు. హాలీవుడ్ రేంజ్ లో జక్కన్న ఆర్ఆర్ఆర్ మూవీని తెరకెక్కించారని బాహుబలిని మించేలా ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియో ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ పేరుతో విడుదలైన ఈ మేకింగ్ వీడియోలో రాజమౌళి సినిమాలోని కీలక పాత్రలను చూపించడంతో పాటు సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ లు ఏ విధంగా ఉండబోతున్నాయో చెప్పకనే చెప్పేశారు. ఈ సినిమాతో ఇండియన్ స్క్రీన్ పై రాజమౌళి మరోసారి మ్యాజిక్ ను క్రియేట్ చేయడం గ్యారంటీ అని అర్థమవుతోంది. వీడియోలో తారక్ కోపంగా ఉన్న లుక్, చరణ్ కు సంబంధించిన లుక్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు హైలెట్ గా నిలిచాయి.

రాజమౌళి ఆర్ఆర్ఆర్ సెట్స్ ను చూపించడంతో పాటు సినిమాకు పని చేస్తున్న సాంకేతిక నిపుణులను పరిచయం చేశారు. శ్రియ లుక్ ను రివీల్ చేయడంతో పాటు నీళ్లు, నిప్పుతో కూడిన సన్నివేశాలను మేకింగ్ వీడియోలో హైలెట్ చేశారు. ఈ వీడియోకు తక్కువ సమయంలోనే రికార్డు స్థాయిలో వ్యూస్, లైక్స్ వచ్చాయి. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజయ్యాక కొత్త రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ మేకింగ్ వీడియో చూస్తే అర్థమవుతోంది. కీరవాణి మేకింగ్ వీడియోకు నేపథ్య సంగీతంతో ప్రాణం పోశారు.

Share.