రాజమౌళికి ఈ తల నొప్పి ఇప్పట్లో తప్పేలా లేదు

సినిమాలకు లీకుల బెడద చాలా రోజుల నుండి వస్తున్నదే. అదీ స్టార్‌ హీరోల సినిమాలకైతే లీక్‌లు కచ్చితం. అందులోనూ రాజమౌళి తీసే భారీ చిత్రాలకు ఇంకా కచ్చితం. సినిమా షూటింగ్‌ సమయంలో ఆయన ఎన్ని జాగ్రత్తలు లీకులు వస్తూనే ఉన్నాయి. సెల్‌ఫోన్లు వద్దు, కెమెరాలు వద్దు.. అంటూ ఆయన తన సెట్‌లో చాలా ఆంక్షలే పెడతారు. అయినా ఎక్కడో లీకులు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ నుండి మరో లీక్‌ బయటకు వచ్చింది.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా క్లైమాక్స్‌ చిత్రీకరణ ప్రస్తుతం సాగుతున్న విషయం తెలిసిందే. దానికి సంబంధించి రాజమౌళి గత కొన్ని రోజులుగా ఆయన స్టైల్‌లో అప్‌డేట్స్‌ ఇస్తూనే ఉన్నారు. అదే రేంజిలో లీక్‌స్టార్లు కూడా లీక్‌ అప్‌డేట్‌లు ఇస్తున్నారు. తాజాగా సినిమా క్లైమాక్స్‌ షూట్‌లోని కొన్ని పిక్స్‌ బయటకు వచ్చాయి. రామ్‌చరణ్‌ సిపాయి గెటప్‌లో కనిపిస్తుంటే, ఎన్టీఆర్‌ మంటల్లో ఫైట్‌ చేస్తూ కనిపించాడు. మరో పిక్‌లో హీరోయిన్‌తో కనిపించాడు ఎన్టీఆర్‌. అసలు ఈ పిక్స్‌ బయటకు ఎలా వచ్చాయనేది పక్కన పెడితే… లీక్‌ అప్‌డేట్‌ మాత్రం సూపర్‌.

సినిమా షూటింగ్‌ దశలోనే ఇన్ని లీకులు వస్తున్నాయంటే… ఇక పోస్ట్‌ ప్రొడక్షన్‌ టైమ్‌లో ఇంకెన్ని లీకులు వస్తాయో చూడాలి. ఇన్ని లీక్‌లు వస్తున్న నేపథ్యంలో రాజమౌళి.. ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుంటారో. బాహుబలి విషయంలోనూ ఇలానే లీకులు పెరుగుతున్న సమయంలో రాజమౌళి జాగ్రత్తలు తీసుకుని కట్టడి చేశారు. ఇప్పుడు కూడా అదే పని చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.