రోషగాడు

“బిచ్చగాడు”తో వచ్చిన సూపర్ క్రేజ్ ను “భేతాళుడు, యమన్, ఇంద్రసేన, కాశీ” లాంటి వరుస ఫ్లాపులతో పోగొట్టుకొన్న విజయ్ ఆంటోనీ ఈసారి ప్రయోగాత్మక చిత్రాలతో కాకుండా ఒక మాస్ మసాలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన “రోషగాడు” చిత్రం తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. మరి ఈ సినిమాతోనైనా విజయ్ ఆంటోనీ మరో విజయాన్ని అందుకోగలిగాడా లేదా? అనేది చూద్దాం..!! roshagadu-1

కథ : కుమారస్వామి (విజయ్ ఆంటోనీ) ఒక కానిస్టేబుల్ గా పోలీస్ కెరీర్ మొదలెట్టి.. తన తమ్ముడితో పందెం కట్టి మరీ డిగ్రీ పాసై ఎస్సై అవుతాడు. అయితే.. ఊహించని రీతిలో పోలీస్ చేద్దామనుకొన్న తన తమ్ముడు రౌడీ అవుతాడు. బాబ్జీ (ధీన) అనే ఓ లోకల్ డాన్ దగ్గర పనిచేస్తు మర్డర్లు గట్రా చేస్తుంటాడు. పోలీస్ బాధ్యతలో భాగంగా ఒక హత్య కేసులో సొంత తమ్ముడ్నే ఎన్ కౌంటర్ చేసి చంపేస్తాడు కుమారస్వామి. అయితే.. తన తమ్ముడిలాగే బాబ్జీ దగ్గర చాలా మంది పని చేస్తున్నారని వాళ్లందరినీ అతడి బారి నుంచి రక్షించాలనుకొంటాడు కుమారస్వామి.

సో, కుమారస్వామి తన తెలివితో బాబ్జీ ఆగడాలకు అడ్డు వేయగలిగాడా? తాను అనుకుంటున్నట్లుగా ఆ మైనర్ కుర్రాళ్లను బాబ్జీ చెర నుంచి తప్పించగలిగాడా? అనేది “రోషగాడు” కథాంశం. roshagadu-5

నటీనటుల పనితీరు : విజయ్ ఆంటోనీ ఆర్టిస్ట్ గా కాస్త ఇంప్రూవ్ అయ్యాడు కానీ.. ఎక్స్ ప్రెషన్స్ విషయంలో ఇంకా తేలిపోతూనే ఉన్నాడు. పోలీస్ క్యారెక్టర్ కి కావాల్సిన బాడీ లాంగ్వేజ్ కానీ.. స్క్రీన్ ప్రెజన్స్ కానీ విజయ్ లో కనిపించవు. “మెంటల్ మదిలో” ఫేమ్ నివేతా పేతురాజ్ ఈ చిత్రంలో లేడీ పోలీస్ ఆఫీసర్ గా కాస్త పొగరుగా నటించాలని ప్రయత్నించి భంగపడింది. ఆమె పాత్ర కాస్తంత హాస్యాన్ని పండించినప్పటికీ.. ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది.

బాబ్జీ పాత్రలో ధీన విలన్ గా అలరించాడు. అతడి క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది. అయితే.. ఆ పాత్రను డైరెక్టర్ ఇంకాస్త ఎక్స్ ఫ్లోర్ చేసి ఉంటే ఆడియన్స్ మీద సదరు పాత్ర యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉండేది. roshagadu-4

సాంకేతికవర్గం పనితీరు : తమిళ సినిమాలో సాంబార్ వాసన రావడంలో తప్పేమీ లేదు. కానీ.. ఈ చిత్రాన్ని తెలుగులోనూ ఏకకాలంలో విడుదల చేస్తున్నామనుకొన్నప్పుడు తెలుగు ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని కనీస స్థాయి జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది. కానీ.. నిర్మాత, సంగీత దర్శకుడు మరియు కథానాయకుడు విజయ్ ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు. కనీసం తదుపరి చిత్రాల విషయంలోనైనా ఈ జాగ్రత్తలు పాటిస్తాడో లేదో.

బేసిగ్గా.. దర్శకుడు గణేషా ఎంచుకొన్న కథ బాగుంది కానీ.. స్క్రీన్ ప్లే సినిమాకి పెద్ద మైనస్. అసలు సినిమా ఓపెనింగ్ మొదలుకొని సెకండాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు చూస్తుంటే.. ఏంటీ ఇవన్నీ ఈ సినిమాలోవేనా అనిపిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు క్లైమాక్స్ ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని రీతిలో కొత్తగా ఉన్నప్పటికీ.. కథనం బాగోకపోవడంతో సినిమాకి ప్రేక్షకులు కనెక్ట్ అవ్వలేరు, ఎంజాయ్ చేయలేరు. పైగా.. ఉన్న రెండు మూడు యాక్షన్ సీక్వెన్స్ లు కూడా కేవలం తమిళ రూరల్ ఆడియన్స్ ను మాత్రమే దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించడంతో ఇక్కడ ప్రేక్షకులు సినిమాలో లీనమవ్వలేరు.

విజయ్ ఆంటోనీ స్వయంగా సమకూర్చుకున్న సంగీతం, నేపధ్య సంగీతం కూడా సోసోగా ఉంది. సినిమాటోగ్రఫీ & ఎడిటింగ్ వర్క్ యావరేజ్ గా ఉన్నాయి.roshagadu-3

విశ్లేషణ : చాలా స్లోగా సాగే ఈ పోలీస్ యాక్షన్ డ్రామా చూడాలంటే కాస్త ఓపికతోపాటు, తమిళ సాంబార్ వాసనను తట్టుకోగల సత్తా కూడా ఉంటే “రోషగాడు” చిత్రాన్ని కష్టపడి ఒకసారి చూడొచ్చు. roshagadu-2

రేటింగ్ : 1.5/5

Click Here To Read In ENGLISH

Share.