వరుసగా రెండు హిట్లు…రీతూ వర్మ దశ తిరిగేలా ఉందే..!

‘బాద్ షా’ చిత్రంతో సినిమాల్లోకి సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చింది రీతూ వర్మ. ఆ చిత్రంలో కాజల్ చెల్లి పాత్రలో కనిపించి కాసేపు ఎంటెర్టైన్ చేసింది. ఆ తరువాత ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ‘పెళ్ళి చూపులు’ ‘కేశవ’ వంటి హిట్ చిత్రాల్లో కూడా నటించింది. నటన పరంగా కూడా రీతూ ఆకట్టుకుంటూ ఉంటుంది. ఆమె నటించిన ప్రతీ సినిమాలోనూ తన బెస్ట్ ఇస్తూ ఉంటుంది. మధ్యలో కాస్త స్లో అయినా.. ఇప్పుడు మెల్లగా పుంజుకునేలా కనిపిస్తుంది రీతూ.

ఇప్పటికే ఈ ఏడాది ఆమె నటించిన ‘కనులు కనులను దోచాయంటే’ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఆ చిత్రంలో రీతూ పాత్రకు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఇక ఆమె నటించిన మరో చిత్రం.. ‘పుదమ్‍ పుదు కాలై’ కూడా తాజాగా అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యింది. ఐదు కథలతో ఈ చిత్రం తెరకెక్కింది.ఐదుగురు దర్శకులు వివిధ షార్ట్ ఫిలింస్‍ లా తెరకెక్కించారు. ఈ క్రమంలో గౌతమ్‍ మీనన్‍ తెరకెక్కించిన ట్రాక్ లో రీతు వర్మ లీడ్ రోల్ పోషించింది.

గౌతమ్‍ మీనన్ సినిమాల్లో హీరోయిన్ ను చాలా స్పెషల్ గా ప్రెజెంట్ చేస్తుంటాడు. ఇందులో కూడా రీతూ వర్మ పాత్రను అందరినీ ఆకట్టుకునేలా డిజైన్ చేసాడు. రీతు వర్మ కూడా తన నేచురల్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఈమె పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి. నాని.. ‘టక్ జగదీష్’ లో కూడా రీతూ ఓ హీరోయిన్ గా నటిస్తుంది. ఆ చిత్రం కూడా హిట్ అయితే రీతూ దశ తిరిగినట్టే అని చెప్పాలి.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Share.