వర్మ…. మహేష్ కి కౌంటర్ వేశాడా లేక ప్రేక్షకులకి కౌంటర్ వేశాడా..?

రాంగోపాల్ వర్మ చేసినా సంచలనమే. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా రిలీజ్ సమయంలో ఆయన చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. చంద్రబాబు తో పాటు టీడీపీ ఎంతల్ని కూడా ఓ ఆట ఆడేసుకున్నాడు వర్మ. ఒక విధంగా ‘టీడీపీ ఓడిపోవడానికి వర్మ కూడా కారణం’ అనే రేంజ్లో కామెంట్లు వినిపించాయి. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రమోషన్స్ సమయంలో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే చిత్రం తీస్తానని ప్రకటించాడు. అయితే వర్మ అంత సీరియస్ గా తీసుకోదు గతంలో ఇలా అనౌన్స్ చేసి.. చాలా ప్రాజెక్టులు మొదలు పెట్టలేదు’ అని అనుకున్నారు.

rgv-about-cast

కానీ ఇప్పుడు ఏకంగా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు..’ అంటూ సాగే ఓ పాటని విడుదల చేసి… ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూపించి అందరికీ షాకిచ్చాడు. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ‘మా వీడియో శుక్రవారం నాడు విడుదలయ్యి గూగుల్ ట్రెండ్స్‌లో సంచలనం సృష్టిస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ ఇంట్రో కంటే.. మా పాట వీడియోకే ఎక్కువ ఆదరణ లభించింది. సూపర్ స్టార్ల కంటే ‘క్యాస్ట్ ఫీలింగ్స్ అంటేనే ఎక్కువ ఆసక్తికరమని తేలింది.. ఇది మంచిది కాదు’ అంటూ వర్మ ట్వీట్ చేశాడు.

Share.