పవర్ స్టార్ ట్రైలర్ రివ్యూ: పవన్ ఫ్యాన్స్ నీ కెలకకుండ బాగానే మేనేజ్ చేశాడు!

ఈరోజు ఉదయం 11.00 ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో మాత్రమే 25 రూపాయలు ఖర్చు చేసి “పవర్ స్టార్” ట్రైలర్ చూడాలంటూ వర్మ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. కేవలం ట్రైలర్ కి వచ్చే డబ్బులతోనే సినిమా తీసేయొచ్చు అని మేధావులందరూ విశ్లేషణలు వెల్లడించేశారు. పవర్ స్టార్ ఫ్యాన్స్, పవన్ యాంటీ ఫ్యాన్స్, వైసీపీ బ్యాచ్, టీడీపీ బ్యాచ్ ఇలా అందరూ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే వర్మ ప్లానింగో లేక మరో కాంట్రవర్సీయల్ పబ్లిసిటీకి తెర లేపాడో తెలియదు కానీ.. ట్రైలర్ యూట్యూబ్ లో లీక్ అయ్యింది.

పవన్ కళ్యాణ్ మీద పేరడీ చిత్రమైనప్పటికీ.. ఎక్కడా పవన్ ను కించపరిచే విధంగా చూపించలేదు. గాజువాక, భీమవరం ప్రాంతాల్లో పవన్ ఓడిపోవడంతో మొదలుకొని, పవన్ మూడో భార్య, పెళ్లి తర్వాత కూడా రెండో భార్యతో కాంటాక్ట్ లో ఉండడం, చంద్రబాబుతో విభేదించడం వరకూ అన్నీ విషయాలను ట్రైలర్ లో చూపించాడు వర్మ. అయితే.. పవన్ ను ప్రవన్ గా ఎందుకు చూపించాడు అనేది తెలియదు. ఆల్రెడీ అన్నీ విధాలా కెలికేసిన వర్మ ఇలా పేరు మార్చడం ఏమిటో.

ఇకపోతే.. ట్రైలర్ లో ఎక్కడా పవన్ కళ్యాణ్ ను తక్కువ చేసే విధంగా లేకపోవడంతో పవన్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. పేరడీ అయినప్పటికీ ఎక్కడా మనిషిని డీగ్రేడ్ చేసి చూపించలేదు. సొ, వర్మ అటు పవన్ ను కానీ.. పవన్ ఫ్యాన్స్ ను కానీ ఏమాత్రం కెలకకుండా బాగానే మేనేజ్ చేశాడు.

Share.