ఓ మంచి తండ్రి హంతకుడు ఎలా అయ్యాడు?

రెండేళ్ల క్రితం తెలంగాణా రాష్ట్రంలో జరిగిన ఓ పరువు హత్య సంచలనం రేపింది. ఉన్నత కుటుంబానికి చెందిన ఓ యువతి దళిత యువకుడిని ప్రేమ వివాహం చేసుకోవడం ఓ దారుణ హత్యకు కారణం అయ్యింది. ఓ తండ్రి కూతురు భర్తను నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా చంపించారు. రాష్ట్రంలో ఆ మర్డర్ పెద్ద దుమారానికి దారితీసింది. కొన్నాళ్ళు మీడియా అటెంషన్ మొత్తం ఈ కేసుపైనే సాగింది. హత్యకు గురైంది దళిత యువకుడు కావడంతో మరిన్ని గొడవలు జరిగాయి.

కాగా ఇదే సంఘటన స్పూర్తితో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మర్డర్ పేరుతో మూవీ ప్రకటించారు. నేడు ఈ చిత్ర ట్రైలర్ కూడా విడుదల చేయడం జరిగింది. సొసైటీలో పేరు, ప్రతిష్ట, హోదా ఉన్న ఓ తండ్రి తన ఒక్కగానొక్క కూతురిని అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. తండ్రి ఎంత ప్రేమ చూపించినా వయసు ప్రభావం ఆ అమ్మాయిని ఓ యువకుడి ప్రేమలో పడేలా చేస్తుంది. దానితో రహస్య వివాహం కాపురం లాంటివి జరిగిపోతాయి. కంటికి రెప్పలా కాపాడుకున్న కూతురు దూరమైందన్న వేదన ఒక వైపు, సమాజంలో పరువు పోయిందే కోపం మరో వైపు.

RGV's Murder Movie Trailer Review1

కూతురు ప్రేమకు-ఆయన పరువుకు మధ్యలో నలిగిపోయిన ఓ తండ్రి మానసిక క్షోభే మర్డర్ మూవీ అని తెలుస్తుంది. ముఖ్యంగా ఆ పెళ్లి వలన ఆ కుటుంబంలో ఏర్పడిన అశాంతి, వేదన వంటి విషయాలు మూవీలో హైలెట్ చేసినట్లున్నారు. ఓ మంచి తండ్రి ఏ కారణంతో హంతకు అయ్యాడు వంటి విషయాలు చర్చించారు అన్పిస్తుంది. ఆద్యంతం సీరియస్ నోట్ లో సాగిన మర్డర్ ట్రైలర్ ఆసక్తి రేపుతుంది. ఈ కథ అందరికీ తెలిసినా, అంతర్గతంగా ఏమి జరిగింది అనేది ఆసక్తి గొలిపే అంశం. దర్శకుడు ఆనంద్ చంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కించగా త్వరలో విడుదల కానుంది.

Share.